Baby the movie : బేబీ సినిమాలో మరీ కొన్ని సీన్స్ యాడింగ్- స్ట్రాటజీ వర్క్ అవుట్ అవుతుందా ?

Baby the movie

ఇటీవలనే చిన్న సినిమాగా రిలీజై, పెద్ద విజయం సాధించిన బేబీ సినిమాలో మరి కొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారట మేకర్స్. ఇప్పటికే దాదాపు 70 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింప బడుతున్న ఈ సినిమాకు నానాటికి ప్రేక్షకదరణ పెరుగుతుండటంతో బేబీ సినిమా నిడివి మరి కొంత పెంచడంతో పాటు, సినిమాలో కీలకంగా ఉండే ఒక పాటను కూడా యాడ్ చేయాలనే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన బేబీ సినిమా జులై 14 న థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈతరం ప్రేమికుల లోపాలను ఎత్తి చూపడంతో యూత్ కు బాగా కనెక్ట్ అయింది. దాంతో బేబీ సినిమాకు తెలుగు రాష్టాల యువత బ్రహ్మరథం పడుతున్నారు. విజయ్ బుల్గని అందించిన సంగీతం ఈ సినిమా మేజర్ గా ప్లస్అవ్వగా, బేబీ సినిమాకు ఒక పక్క యూత్ మరియు సాధారణ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

కాగా బేబీ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. అయినా కూడా సినిమా ఎందుకో కాస్త అసంపూర్ణంగానే అనిపిస్తుంది. అయితే ఇలా అసంపూర్ణంగా ఉండటానికి గల కారణాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ పలు ఇంటర్వ్యూలలో చాలా సార్లు ప్రస్తావించారు.

- Advertisement -

ప్రేక్షకుల దగ్గరి నుంచి వస్తున్న కామెంట్స్ తాను గమనిస్తున్నానంటూ చెబుతూ , సినిమా నిడివి ఇప్పటికే 3 గంటలు ఉండటం వల్ల ఆల్రెడీ షూట్ చేసిన కొన్ని సీన్స్ ను సినిమాలో పెట్టలేకపోయాం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే షూట్ చేసిన సీన్స్ ను తరువాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అని చెప్పిన ఆయన లేటెస్ట్ గా సినిమాలోనే ఈ సీన్స్ యాడ్ చేసి థియేటర్స్ లో విడుదల చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం

అయితే ఈ విధంగా చేయడం వల్ల ప్రేక్షకులు మళ్ళీ థియేటర్స్ కు వస్తారని దాని వల్ల కలెక్షన్స్ కూడా పెరుగుతాయని మూవీ టీం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో కూడా చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా చాలా సినిమాలు ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా ఆయా సినిమాల లిస్ట్ లో బేబి చేరబోతుందని వార్త. మరీ స్ట్రాటజీ బేబీ సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. యాడ్ చేసిన ఈ సీన్స్ ఆగస్ట్ నుంచి థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారని టాక్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు