Double Ismart Latest Update: డబుల్ ఇస్మార్ట్ నుంచి డాషింగ్ అప్డేట్

Double Ismart Latest Update

రామ్ పోతినేని హీరోగా- పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ నుంచి డాషింగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై వస్తోన్న ఒక బిగ్గెస్ట్ రూమర్ కు చెక్ పెడుతూ.. ఫ్యాన్స్ అందరిలో డబుల్ ఇస్మార్ట్ ఫీవర్ ని మరింత పెంచేలా క్రేజీ అప్డేట్ ను పోస్టర్ ద్వారా రివీల్ చేసింది.

2019 లో రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ కలయిక లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి అందరికి తెలిసిందే. యూత్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చాలా రోజులుగా హిట్ కోసం చూస్తున్న పూరికి- రామ్ కు సాలిడ్ హిట్ ను అందించింది. ఇస్మార్ట్ శంకర్ ముందు వరకు పూరి కెరీర్ అయిపొయిందనుకునే వాళ్ళందరి నోళ్లు ఈ సినిమా హిట్ తో మూసేసాడు పూరి.

ఇక లేటెస్ట్ గా పూరి,  ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్  పేరుతో మరో సినిమా చేస్తున్నాడు. ఛార్మి, పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలనే మొదలైంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్టు నిన్నటి, మొన్నటి వరకు రూమర్స్ రాగా కాసేపటి క్రితమే రూమర్స్ కు చెక్ పెడుతూ సంజయ్ దత్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

- Advertisement -

స్టైలిష్ లుక్ లో సంజయ్ దత్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సిగార్ వెలిగిస్తూ.. వైల్డ్ లుక్ ఇస్తున్న సంజయ్ దత్ పోస్టర్ చూస్తుంటే పూరి డబుల్ ఇస్మార్ట్ ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టే తెలుస్తుంది. అలాగే సంజయ్ దత్ పాత్ర పేరు బిగ్ బుల్ అని కూడా పోస్టర్ ద్వారా రివిల్ చేసారు.

వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఇక నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ ఒక్క పోస్టర్ తో టాలీవుడ్ లో ఇస్మార్ట్ ఫీవర్ స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నాభ నటేష్, నిధి అగర్వాల్ నటించగా, ఈ సినిమాలో హీరోయిన్స్ గా మళ్ళీ వల్లనే తీసుకుంటారా, లేక కొత్త హీరోయిన్స్ ను తీసుకోబోతున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు