Miss Shetty Mr Polishetty: మమ్మల్ని క్షమించండి- అనుకున్నదే అయింది

Miss Shetty Mr Polishetty

ఈ మధ్య కాలంలో పేరున్న పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ లు మమ్మల్ని క్షమించండి అంటూ ఎమోషనల్ పోస్ట్ లు పెట్టడం ఫ్యాషన్ అయిపొయింది. సినిమా టీజర్ అప్డేట్, ట్రైలర్ అప్డేట్ అంటూ ఫ్యాన్స్
మరియు సినీ ప్రేమికుల అటెన్షన్ ను కొట్టేసి, తీరా టైం వచ్చేసరికి టెక్నికల్ మిస్టేక్ అని ఎదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటున్నారు. గత కొద్దీ టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇక లేటెస్ట్ గా మరోసారి మరో ఎమోషనల్ పోస్ట్ తో ఫ్యాన్స్ ఓపికను పరీక్షించుతుంది ఒక ప్రొడక్షన్ హౌస్

పాన్ ఇండియా సినిమాల నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తోన్న లేటెస్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా గురించి అందరికి తెలిసిందే. అనుష్క, యంగ్ టాలెంటెడ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన తారాగణంగా వస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

అప్పుడెప్పుడో షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటి కూడా రిలీజ్ కు నోచుకోలేదు. ఇంతరేతర కారణాల సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ, వస్తున్న మూవీ టీం కొద్దీ రోజుల క్రితమే ఆగస్ట్ 4న ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. దాంతో నవీన్ పోలిశెట్టి కూడా తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. నిన్న మొన్నటి వరకు ఇదే రిలీజ్ డేట్ ఫిక్స్ అనుకొంటుండగా, తీరా ఈరోజు చూస్తే సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నాం మమ్మల్ని క్షమించండి అంటూ యూవీ క్రియేషన్స్ ఒక నోట్ రిలీజ్ చేసింది.

- Advertisement -

అయితే నిజానికి ఈ నిర్ణయంలో తప్పు లేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. కాగా ఆగస్ట్ 10న రజనీకాంత్ జైలర్ సినిమా, అలాగే మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్  సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలు అవడంతో రిస్క్ వద్దనుకుని రిలీజ్ పోస్ట్ పోన్ చేశారనుకుందాం అనుకుంటే,యూవీ క్రియేషన్స్ విడుదల చేసిన నోట్ లో ఈ రీజన్ ను మెన్షన్ చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమా రిలీజ్ చేయలేకబోతున్నాం అంటూ తెలిపింది.

దాంతో ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయకుండా ఎం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలన్స్ ఉంచుకొని ఎందుకని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారంటు ప్రొడక్షన్ హౌస్ పై మండి పడుతున్నారు. రిలీజ్ డేట్ ఆలస్యానికి అసలు కారణం చెప్పకుండా ఈ కొసరు అబద్దాలు చెప్పడం ఏం సంస్కరమో మరీ యూవీ క్రియేషన్స్ కె తెలియాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు