#SSMB29 Inside News Leak : మహేష్- రాజమౌళి సినిమా స్క్రిప్ట్ సెషన్స్ డేట్ లాక్

#SSMB29 Inside News Leak

మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవలనే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు చెప్పిన రైటర్ విజేంద్ర ప్రసాద్ జులై చివరికల్లా ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ ను రాజమౌళి కి అందిస్తా అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇక లేటెస్ట్ గా ఈ సినిమా స్క్రిప్ట్ సెషన్స్ త్వరలోనే నిర్వహించబోతున్నట్టు సమాచారం అందుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మహేష్ బాబు- త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ గుంటూరు కారం సినిమాపై రోజుకోరకంగా న్యూస్ వస్తుండగా ఈ సినిమా అసలు చేస్తారా.. లేక మధ్యలోనే ఆగిపోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మహేష్- రాజమౌళి సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉంటూ త్రివిక్రమ్ సినిమాను అసలు లెక్క చేయడం లేదంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే గుంటూరు కారం సినిమా కంప్లిట్ అయ్యేదాకా రాజమౌళి సినిమా గురించిన ఏ అప్డేట్ ఇవ్వకూడదని ఇండస్ట్రీలో అంతర్గతంగా చర్చలు జరిగాయట.

ఇదిలా ఉండగా మహేష్- రాజమౌళి సినిమా గురించిన స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. ఇక మహేష్ డిసెంబర్ లోపు గుంటూరు కారం సినిమా షూటింగ్ కంప్లిట్ చేసి, రాజమౌళి సినిమా రీడింగ్ సెషన్స్ లో పాల్గొంటారట. ఇక ఆ తరువాత జనవరిలో గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వగానే, మహేష్ పూర్తిగా రాజమౌళి సినిమాపైనే కాన్సెన్ట్రేషన్ చేయనున్నాడట. అయితే ఈ అప్డేట్ ను ఆగస్ట్ 9 మహేష్ పుట్టిన రోజున అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్టు టాక్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు