Anirudh Ravichander : అప్పుడు కోటికి నో అన్నాడు.. ఇప్పుడు 4 కోట్లు

నిజానికైతే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత చిత్రానికి అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. అంతకు ముందు అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్ అయ్యింది కాబట్టి… ఎన్టీఆర్ తమన్ ను ఎంపిక చేసుకోమని దర్శకనిర్మాతలకి తెలిపాడు.అరవింద సమేత కోసం అనిరుధ్ కు రూ.1 కోటి పారితోషికం ఆఫర్ చేశారు.

 

సగం అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి… ఆ డేట్స్ ను జెర్సీ కోసం వాడుకున్నారు హారిక అండ్ హాసిని వారు.జెర్సీ కి ప్రాణం అంటే ఒకటి నాని నటన ఇంకోటి అనిరుధ్ మ్యూజిక్ అనే చెప్పాలి. గోపి సుందర్ ను తప్పించి మరీ అనిరుధ్ ను పెట్టుకున్నందుకు అతను తగిన న్యాయం చేశాడు

- Advertisement -

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల ప్రాజెక్ట్ కోసం అనిరుధ్ ను సంప్రదించగా ఇప్పుడు ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేశాడట అనిరుధ్. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.కానీ ఎన్టీఆర్ మాత్రం తనకి అనిరుధ్ కావాలని పట్టుబట్టాడు. హీరో మాట కాదన లేక దర్శక నిర్మాతలు దిగొచ్చినట్టు తెలుస్తుంది.అనిరుధ్ అయితే సినిమాకి పాన్ ఇండియా కళ వస్తుంది అని ఎన్టీఆర్ ఆలోచన.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు