Jayasudha: ఆ ఇద్దరి స్టార్ హీరోలపై ప్రత్యేక శ్రద్ధ.. కారణం…?

Jayasudha.. సహజ నటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న జయసుధ.. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలతో కలిసి నటించింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఆ ఇద్దరి స్టార్ హీరోలపై మాత్రమే ఈమె ప్రత్యేక శ్రద్ధ పెట్టేదట.. అంతేకాదు వారినే అన్నయ్య అని పిలిచేదట.. దానికి గల కారణాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.. మరి ఇంతకీ ఏంటా కారణం? ఎవరా ఇద్దరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

Jayasudha: Special attention on those two star heroes.. Reason...?
Jayasudha: Special attention on those two star heroes.. Reason…?

ఆ ఇద్దరు అంటేనే ఇష్టం..

తెలుగుతోపాటు తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించిన జయసుధ.. స్టార్ హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది. అందులో భాగంగానే ఒక ఇద్దరు స్టార్ హీరోలను మాత్రమే తాను అన్నయ్య అని ఆప్యాయతగా పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది జయసుధ.. ఎందుకంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాను సొంత ఫ్యామిలీగా భావించేది కొంతమందిని మాత్రమే అని నిర్మొహమాటంగా చెప్పేసింది.. తన కుటుంబంలో ఇండస్ట్రీ నుంచి మురళీమోహన్, మోహన్ బాబు మాత్రమే ఉన్నారు అని స్పష్టం చేసింది..

ఆ పిలుపే కుటుంబ సభ్యులుగా మార్చింది..

జయసుధ మాట్లాడుతూ.. వీరిద్దరే నన్ను చెల్లెమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారు.. అందుకే వారిని నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను అంటూ తెలిపింది సహజ నటి జయసుధ. ఇకపోతే మురళీమోహన్ , మోహన్ బాబు లతో జంటగా ఎన్నో సినిమాలు చేసింది జయసుధ.. అర్ధాంగి , ఏడడుగుల బంధం, నా మొగుడు నాకు సొంతం, శ్రీమతి గారు, దేవత , ఓ తండ్రి తీర్పు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఈ ఇద్దరు హీరోలతో చేసింది. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.. ఇకపోతే ఎవరిని పడితే వారిని అన్నయ్య , అక్క అని పిలిచే అలవాటు తనకు లేదని.. ఎవరితో ఎక్కడ వరకు ఉండాలో అక్కడి వరకు మాత్రమే ఉంటాను అంటూ జయసుధ కామెంట్లు చేసింది.. ప్రస్తుతం మురళీమోహన్, మోహన్ మోహన్ బాబు మాత్రమే ఇండస్ట్రీలో తనకు కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అంటూ చెప్పుకొచ్చింది జయసుధ.. దీంతో జయసుధ చేసిన కామెంట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి .. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని సక్సెస్ చూసిన ఈమె పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

- Advertisement -

సినిమాలే కాదు రాజకీయాలు కూడా..

అడపాదడపా సినిమాలలో బిజీగా గడిపేస్తున్న ఈమె ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రకరకాల పార్టీలు మారారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.. ప్రస్తుతం సినిమాలు పూర్తిగా తగ్గించేసి.. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలలో నటిస్తోంది జయసుధ. ఇక ప్రస్తుతం ఒక ఇంగ్లీష్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సహజనటిగా గుర్తింపు దక్కించుకొని.. అటు తెలుగు, ఇటు తమిళ్ సినిమాలలో నటిస్తూ ఇప్పుడు ఏకంగా ఇంగ్లీష్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది జయసుధ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు