7 years for Bahubali 2: బాహుబలి 2 సృష్టించిన 10 రికార్డ్స్ ఇవే..!

7 years for Bahubali 2.. బాహుబలి2 : ది కన్ క్లూజన్.. రెబల్ స్టార్ ప్రభాస్, రానా హీరోలుగా అనుష్క, తమన్నా హీరోయిన్ లుగా కె.వి విజయేంద్ర ప్రసాద్ రచనా సారధ్యంలో తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం బాహుబలి 2.. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం 2015 లో వచ్చిన మొదటి భాగం బాహుబలి : ది బిగినింగ్ కి కొనసాగింపుగా తెరకెక్కించారు. రెండు భాగాలకి గాను రూ.250 కోట్లు ఖర్చు చేయగా.. మొత్తం రూ. 1607 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28 2017లో విడుదల అయింది. ఇక నేటితో ఈ సినిమా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా సృష్టించిన పది రికార్డుల గురించి ఇప్పుడు చూద్దాం.

7 years for Bahubali 2: These are the 10 records created by Bahubali 2..!
7 years for Bahubali 2: These are the 10 records created by Bahubali 2..!

1. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు జరగని అడ్వాన్స్ బుకింగ్ ఈ సినిమాకు మాత్రమే దక్కింది. తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో అన్ని రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మీదనే కోట్లు సంపాదించిన ఏకైక చిత్రంగా బాహుబలి 2 నిలిచింది.

2. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9000 స్క్రీన్ లలో విడుదలై చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు 4, 350 థియేటర్లలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా విడుదలై రికార్డు సృష్టించింది ..ఆ తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేస్తూ బాహుబలి 2 సినిమా ఏకంగా తొమ్మిది వేల స్క్రీన్ లలో విడుదల కావడం గమనార్హం .

- Advertisement -

3. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటివరకు ఎక్కడ నమోదు అవ్వని ఆక్యుపెన్సీ ని క్రియేట్ చేసిన మొట్టమొదటి సినిమాగా రికార్డు సృష్టించింది.

4. అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమా బాహుబలి 2. మామూలుగా అయితే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్ సినిమాలకు రూ.100 కోట్లు రాబట్టడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. అలాంటిది కేవలం ఒక్క రోజులోనే రూ.125 కోట్లు వసూలు చేసింది.. నాలుగు రోజుల్లోనే రూ.530 కోట్లు సాధించిన ఏకైక చిత్రంగా నిలిచింది.

5. సౌత్ నుంచి నార్త్ వరకు ఇండియాలో చిన్న గల్లీ నుంచి క్రేజ్ సంపాదించిన సినిమా కూడా ఇదే.

6. ఇండియాలో హోలీ , దివాలీ వంటి పండుగలకు సెలవు ప్రకటించడం అందరికీ తెలిసిందే.. అలాంటిది బాహుబలి 2 సినిమాకి కంపెనీలు హాలిడే ప్రకటించాయంటే బాహుబలి 2 సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదని చెప్పవచ్చు..

7. బాహుబలి 2 కి సంబంధించిన పోస్టర్ , ట్రైలర్, టీజర్ అని కూడా యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేశాయి. ఇంతవరకు ఏ సినిమాకి యూట్యూబ్లో ఇంత అరుదైన రికార్డు లభించలేదు. ఇండియా మొత్తంలోనే బాహుబలి 2 ట్రైలర్ పాపులర్ అయింది.

8. భారతదేశంలో అత్యంత ఖరీదు పెట్టి టికెట్స్ కొన్న ఏకైక చిత్రం కూడా ఇదే. ఒక్కో టికెట్ మల్టీప్లెక్స్ లోనే రూ.700 నుంచీ రూ.1000 పలికాయి.

9. విడుదలైన అన్ని భాషల్లో కూడా రికార్డు సృష్టించిన ఏకైక తెలుగు చిత్రం బాహుబలి 2.

10. అమెరికాలో ఏ సినిమా కూడా విడుదలవ్వని విధంగా 800 స్క్రీన్ లలో విడుదలైన ఏకైక ఇండియన్ ఫిలిం గా బాహుబలి 2 రికార్డు సృష్టించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు