Pushpavalli: పెళ్లి కాకుండానే తల్లి..ఎంతో మందితో ఎఫైర్.. ఆఖరికి కూతురు కూడా ..!

Pushpavalli.. ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ పుష్ప వల్లి గురించి నేటితరం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.. కానీ ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈమె అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న దక్షిణాది సినిమా సూపర్ స్టార్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు కూతుర్లకు తల్లి కూడా అయింది.. హేమమాలిని, వైజయంతి, మాల శ్రీ, రేఖ, జయప్రద, శ్రీదేవి వంటి తారలు బాలీవుడ్ లోకి అడుగుపెట్టక ముందే దక్షిణాది సినిమాలలో పనిచేసి సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ లోకి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈమెకు ఇద్దరు కూతుర్లు కాగా వారిలో ఒకరు సూపర్ స్టార్ హీరోయిన్ కూడా.. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రేఖ..

Pushpavalli: Unmarried mother.. Affair with many people.. Finally daughter too..!
Pushpavalli: Unmarried mother.. Affair with many people.. Finally daughter too..!

రేఖ తల్లే పుష్పవల్లి..

రేఖ తల్లి పుష్పవల్లి తమిళ్, తెలుగు సినిమాలలో నటించారు. సినిమా తెరపై సంపూర్ణ రామాయణంలో సీత పాత్రలో నటించి పేరు కూడా తెచ్చుకున్నారు. ఇక 1936లో విడుదలైన ఈ చిత్రంలో సీత పాత్రను పోషించిన ఈమె అందుకుగాను రూ.300 పారితోషకం కూడా అందుకుంది. ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచిన పుష్పవల్లికి.. పలు సినిమాలలో అవకాశాలు కూడా లభించాయి. అయితే ఈమె సినిమాల కంటే వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. 1940లో వివాహం జరిగింది.. కానీ ఆరు సంవత్సరాల లోనే వైవాహిక జీవితం దెబ్బతినింది.భర్త నుండి వేరుగా జీవిస్తూ .. ఇద్దరు పిల్లలతో జీవితాన్ని కొనసాగించింది.. ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేషన్ తో కలిసి మిస్ మాలిని అనే చిత్రంలో హీరోయిన్ గా నటించడం తో ఈమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. అదే సమయంలో జెమినీ గణేషన్ తో ప్రేమలో పడింది.. కానీ అప్పటికే ఈయనకు వివాహం కూడా అయింది. అయితే పుష్పవల్లికి మాత్రం ఎప్పుడూ భార్య హోదా ఇవ్వలేదు. కానీ పుష్పవల్లి మాత్రం జీవితమంతా అతడి ప్రేయసి గానే బ్రతికింది.. వివాహం కాకుండానే జెమినీ గణేషన్ ఇద్దరు కుమార్తెలకు తల్లి అయింది. ఇక చివరిగా 1991లో స్వర్గస్తురాలయ్యారు పుష్పవల్లి..

తల్లిలాగే కూతురు కూడా..

ఇకపోతే ఈమె ఎన్నో చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు.. కానీ ఈమె కూతురు రేఖా మాత్రం సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా జరిగింది.. తొలిసారి రంగులరాట్నం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేఖ వయస్సు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే.. 15 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ లో అడుగుపెట్టి సత్తా చాటింది. ఇక తల్లిలాగే రేఖ జీవితం కూడా అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే.. కొంతమంది హీరోలతో ఎఫైర్ నడిపిన రేఖ కూడా మొదటి వివాహం చేసుకోగా అది కాస్త విఫలం అయింది.. ఇక ఎంతో ఫేమస్ అయిన ఈమె 69 సంవత్సరాల వయసులో కూడా ఒంటరిగానే జీవిస్తోంది.. అలా తల్లిలాగే కూతురు కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు