నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. అతను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన వెబ్ సిరీస్ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. మరోపక్క వెంకట్ ప్రభు దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్టు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వివరాల్లోకి వెళితే…. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టుకుని డీసెంట్ హిట్టు కొట్టిన బొమ్మరిల్లు భాస్కర్… నాగ చైతన్యతో ఓ మూవీ చేయబోతున్నాడని తెలుస్తుంది.
ఈ మూవీకి ఏకె ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర లేదా 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట లు నిర్మించే అవకాశం ఉంది.త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుందని వినికిడి. ఈ ఏడాది బంగార్రాజు చిత్రంతో ఓ హిట్ అందుకున్నాడు చైతన్య.