BellamKonda Sreenivas : కొండన్న కొత్త సినిమాకి ఇంత బడ్జెట్టా? ఇందులో సగం మార్కెట్ కూడా లేదయ్యా?

BellamKonda Sreenivas : టాలీవుడ్ లో నిర్మాతల ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకడు. పదేళ్ల కింద స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతో యావరేజ్ సినిమాని అందుకున్నా, హీరోగా నిలదొక్కుకోగలడు అని చాలా మందికి నమ్మకమొచ్చింది. కానీ ఆ నమ్మకం ఇప్పటివరకు నిజమవలేదు. రొటీన్ యాక్టింగ్ చేస్తాడని విమర్శలు ఉన్న ఈ హీరో కష్టపడి ఏ సినిమా చేసినా అది ప్లాప్ అవుతుంది. మధ్యలో రాక్షసుడు అని రీమేక్ మూవీ తో వచ్చి ఓ మోస్తరు సక్సెస్ అందుకున్నాడు. కానీ దాంతో బెల్లంకొండకి ఒరిగిందేమి లేదు. ఇక లాస్ట్ ఇయర్ ఛత్రపతి హిందీ రీమేక్ తో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో బెల్లంకొండ పై వచ్చిన ట్రోల్స్ మామూలు కావు. ఏది ఏమైనా ఇప్పుడు బెల్లంకొండ వారసుడికి ఓ నిఖార్సైన హిట్టు కావాలి. దానికోసమే కాస్త అలోచించి సేఫ్ లో ఉండాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు బెల్లంకొండ వారసుడు.

భారీ బడ్జెట్ తో బెల్లంకొండ సినిమా..

అయితే ప్రస్తుతం టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో టైసన్ నాయుడు తెరకెక్కుతుంది. ఇక ఆ తర్వాతి సినిమాలను కూడా ఒకే సారి షూటింగ్ చేసెనుకు లైన్లో పెట్టాడు. టైసన్ నాయుడు తర్వాత సాహు గారపాటి నిర్మిస్తున్న ఓ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ తోనే చాలా డెప్త్ ఉన్న ఘాడ‌మైన క‌థాంశాన్ని తెర‌పై చూపుతామ‌ని ఫీలింగ్ ని కలిగించారు. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ నుండి ఈ ఎలక్ట్రిఫైయింగ్ హారర్ మిస్టరీతో మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందజేస్తున్నామ‌ని చెప్పడం జరిగింది.

కెరీర్ లో హై బడ్జెట్.. అందులో సగం మార్కెట్ అయినా ఉందా?

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ (BellamKonda Sreenivas) నటిస్తున్న కొత్త సినిమా హర్రర్ కాన్సెప్ట్ నేపధ్యంలో సినిమా ఉండబోతుండగా, ఈ సినిమా కోసం ఇప్పుడు ఆల్మోస్ట్ 55-60 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా నిర్మాణం చేస్తున్నారని సమాచారం. బెల్లంకొండ సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ గా జరుగుతూ ఉండటంతో ఈ రేంజ్ రేటు కూడా రికవరీ అవుతుంది అన్న నమ్మకంతో నిర్మాతలు ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్ సంగతి పక్కన పెడితే, బెల్లంకొండ సినిమాకు థియేటర్ బిజినెస్ కనీసం 20 కోట్లు అయ్యే దశలో కూడా ఇప్పుడు పరిస్థితి లేదు. ఎవరైనా స్టార్ డైరెక్టర్ ఉంటె తప్ప 30 దాటదు. అలాంటిది అంత భారీ బడ్జెట్ అంటే నిర్మాతలు చాలా రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. మరి ఈ భారీ బడ్జెట్ మూవీ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కంబ్యాక్ ను సొంతం చేసుకుని బడ్జెట్ కి న్యాయం చేసే కలెక్షన్స్ ని అందుకుంటాడో లేదో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు