HBD Samantha : సమంత..ది క్వీన్ ఆఫ్ టాలీవుడ్.. ఎప్పటికీ

HBD Samantha : సమంత రూత్ ప్రభు.. ఈ పేరు తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరేమో.. ఏ మాయ చేసావే అంటూ తెలుగు వాళ్ళని పద్నాలుగేళ్ల కింద పలకరించిన ఈ భామ నిజంగా ప్రేక్షకులని మాయ చేసిందని చెప్పాలి. కుర్రకారు గుండెల్లో జెస్సి గా అప్పుడే గుండెల్లోకి దూసుకుపోయింది. పేరుకి , మలయాళ భామ అయినా తెలుగమ్మాయిగా టాలీవుడ్ లోనే గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా తెలుగునాట ఎదిగింది. కెరీర్ బిగినింగ్ లోనే చిన్న వయసులోనే వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన సమంత ఎన్నో కష్టాలను అధిరోహించి ఈ స్థాయికి ఈ స్థాయికి వచ్చిందని చెప్పొచ్చు. ఈ పద్నాలుగేళ్ల సినీ ప్రయాణంలో సమంత ఎంతలా ఎదిగిందో, అదే స్థాయిలో కెరీర్ లో డౌన్ అయింది కూడా. వాటాన్నిటిని అధిగమనించి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డ సమంత జీవితం చాలా మంది హీరోయిన్లకు ఆదర్శం అని చెప్పాలి. ఇక నేడు (ఏప్రిల్ 28) సమంత బర్త్ డే (HBD Samantha). ఈ సందర్బంగా తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని గుర్తు చేసుకుందాం..

37 ఏళ్ళ సమంత.. సినీ ప్రయాణంలో అద్భుతాలు..

37 ఏళ్ళ సమంత కెరీర్ బిగినింగ్ డేస్ నుండి సినిమా ఇండస్ట్రీ లో ఎదిగిన వైనం రానున్న హీరోయిన్లందరికి ఆదర్శమని చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నేడు ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతూ, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా హీరోలతో సరి సమానంగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ సమంత అని చెప్పాలి. చిన్న చిన్న యాడ్స్ చేసి ఆ పాపులారిటీ తో సినిమాల్లోకి వచ్చిన సమంత తొలి సినిమాలోనే హీరోయిన్ గా తన, అందంతో అభినయంతో ఆకట్టుకుంది. ఇక నటనలో అందంలో ఈమె తర్వాతే ఎవరైనా, అనే రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. గౌతమీ మీనన్ దర్శకత్వంలో తెరకేక్కించిన ఏమాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత అదే సినిమాతో కుర్రాళ్ల గుండెలను దోచుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మనం, రంగస్థలం వంటి సినిమాలు ఈమె రేంజ్ ను మరింత పెంచాయనే చెప్పాలి.

చై తో ప్రేమలు.. విడాకులు.. కష్టాలు..

ఇక సమంత తెలుగులోనే కాదు తమిళ్ లో సూర్య, విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. అలాగే బాలివుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, వరుస హిట్ లతో ఫుల్ బిజీగా, కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అక్కినేని కోడలు అయిన సమంత (HBD Samantha) కు మరింత పేరు వచ్చింది. ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్స్ లో ఒకటి గా ఆయా జంట నిలిచింది. కాని ఆ ట్యాగ్ ను ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేకపోయింది ఈ అమ్మడు. ఐదేళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పి 2021 లో విడిపోయారు.

- Advertisement -

పడిలేచిన కెరటం..

అయితే నాగచైతన్య నుంచి విడిపోతే తన జీవితంలో ఊహించని మలుపులు ఎదురవు తాయని ఆలోచించలేదేమో, కానీ ఎప్పుడైతే అతడికి విడాకులు ఇచ్చిందో అప్పటినుంచి ఈమె కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిందని చెప్పాలి. అంత పెద్ద ఫ్యామిలీ నుండి విడిపోయిన తర్వాత ప్రతి విషయంపై కూడా సామ్ ను పూర్తిస్థాయిలో నెగిటివ్ గా ట్రోల్ చేశారు. ఏ పని చేసిన నెగిటివ్ గా స్పందించారు. అలా ఎన్నో కష్టాలను పడింది. అంతకుమించి ఇబ్బందులను సమంత ఎదుర్కొంది. మానసికంగా, శారీరకంగా కూడా అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉంది. వాటన్నింటినీ పట్టించుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురీది శిఖరాలను అధిరోహించింది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న సమంత కెరీర్ లో మరింత ముందుకు సాగాలని ఫిల్మీ ఫై నుండి ఆమె కు బర్త్ డే విషెస్ ని అందచేస్తున్నాము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు