Neninthe: అప్పుడు సైటర్లు వేసాడు.. ఇప్పుడే అదే సినిమా చేస్తున్నాడు

Neninthe:

హరీష్ శంకర్ ఈ పేరును కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా షాక్ ఇచ్చిన కూడా, దానిని నుండి నిలబడి “మిరపకాయ్” తో ఘాటైన హిట్ కొట్టాడు. వెంటనే పవర్ స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేయగానే హరీష్ శంకర్ స్థాయి మారిపోయింది. ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా ఒక ముద్రను వేసాడు. ఆ తరువాత హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు చేసిన గబ్బర్ సింగ్ సినిమాను మించిన పేరు అయితే ఏ సినిమాకి రాలేదు.

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ తెరి సినిమాకు రీమేక్ గా తెరెక్కుతుంది. ఇదే రీమేక్ సినిమానే అయినా హరీష్ దీనికి ఒక కొత్త టచ్ ఇస్తున్నాడు అని చెప్పొచ్చు, ఓజి తో పాటుగా ఈ సినిమాపై కూడా అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే హరీష్ శంకర్ డైరెక్టర్ గా చేసిన “షాక్” సినిమా డిజాస్టర్ అయ్యాక, మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా , రైటర్ గా పనిచేసాడు హరీష్. అలానే నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించాడు హరీష్ శంకర్ , అందులో నేనింతే సినిమా ఒకటి. ఈ సినిమాలో హరీష్ శంకర్ ఒక డైలాగ్ చెప్తూ సెటైర్ లు వేస్తాడు ఆ డైలాగ్ ఏంటి అంటే “ఎక్కడ నుంచి తేవాలి కథలు, హీరో ఇంట్రడక్షన్ కి పాతిక మందిని నరకాలి, ఇంటర్వెల్ కి యాభై మందిని నరకాలి, క్లైమాక్స్ లో వందమందిని నరకాలి , ఈ నరకడం కామన్ గా పెట్టుకుని కథలు రాయాలి” అంటాడు.

- Advertisement -

ప్రస్తుతం హరీష్ చేస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్ ” సినిమా అప్డేట్ ఇస్తూ ఒక ఫోటో ను షేర్ చేసాడు హరీష్ శంకర్. ఆ ఫొటోలో హరీష్ శంకర్ ముందు రకరకాల కత్తులు కనిపిస్తున్నాయి. నేనింతే సినిమాలో చెప్పినట్లు నరకడం కామన్ గా పెట్టుకుని కథ రాశాడో , ఇంకేమైనా చేసాడు సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు