800 The Movie: ముత్తయ్య మురళీధరన్ ట్రైలర్… సాంబార్ మసాలా ఎక్కువైందా?

800 The Movie:

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’ ది మూవీ’. ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా 800 మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు.

ఇక ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. ఇక తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఒక సాధారణ మిడిల్ క్లాస్ యువకుడు ప్రాంతీయ బేధాల కారణంగా వివక్ష చూపబడి, దాన్ని ఎదుర్కుంటూ క్రికెట్ లో ఒక గొప్ప స్పిన్నర్ గా ఎలా ఎదిగాడన్నదే సినిమా కథ గా చూపించారు. ఇక సినిమాలో మురళీధరన్ ఎన్నో లోటుపాట్లను క్రికెట్ లో ఎదుర్కొన్నట్టు చూపించారు. అయితే సినిమాలో కొంచెం కమర్షియల్ పాళ్ళు ఎక్కువయ్యాయేమో అని అనిపిస్తుంది. దానికి కారణం ఈ సినిమా తమిళ్ సినిమా కావడం అయితే ఈ బయోపిక్ శ్రీలంక ప్లేయర్ ది కావడం మరో రీసన్.

- Advertisement -

https://youtu.be/DLN0iI1oRrQ?feature=shared

 

ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో శ్రీలంక తమిళుల విప్లవ కారుడు టైగర్ ప్రభాకరన్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉన్నట్టు చూపించారు. దాంతో 800 సినిమా తమిళనాడులో కొంచెం రాజకీయ రగడగా మారే అవకాశం ఉంది. అయితే సినిమాలో ప్రాంతీయాభిమానం కొంచెం అతిగా వాడినట్టు ట్రైలర్ ని చూస్తే అనిపిస్తుంది. అయితే సినిమా వచ్చే వరకు ఏది చెప్పలేం.

మధుర్ మిట్టల్ తో పాటు సినిమాలో మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ కీలక పాత్రల్లో నటించడం జరిగింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు