Miss Shetty Mister Polishetty: పొలిశెట్టికి మెగా విషెస్.. ఇక ప్రమోషన్లతో పనిలేదా?

Miss Shetty Mister Polishetty:

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అసలు ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఎవరు పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఉన్న నవీన్ తో అనుష్క అదికూడా హీరోయిన్ గా నటిస్తుందంటే మ్యాచ్ కాదని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత వారి అభిప్రాయం మారింది. సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా 6నెలల కిందటే రిలీజ్ కావాల్సి ఉండగా, పెద్ద సినిమాల పోటీ వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

తాజాగా అన్ని అడ్డంకులు దాటుకుని సెప్టెంబర్ 7న రిలీజ్ కి సిద్ధమైంది. అయితే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక కూడా హైప్ అయితే రావడం లేదు. పైగా నవీన్ పొలిశెట్టి ముందు నుండి ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూనే ఉన్నాడు. చాలా ఈవెంట్లకు హాజరవుతూ, లేటెస్ట్ గా బిగ్ బాస్ షో లో కూడా ప్రమోషన్ కి వచ్చాడు. కానీ ఆన్లైన్ బుకింగ్స్ చూస్తే పెద్దగా అవడం లేదు.

ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని చూడడం జరిగింది. అంతే కాదు హీరో నవీన్ పోలిశెట్టి తో సహా చిత్ర యూనిట్ ని పిలిచి అభినందించారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ వేస్తూ, ఈ సినిమా చూసిన మొదటి ప్రేక్షకుడిని తానే నని, జాతి రత్నాలు తరువాత నవీన్ మరోసారి కడుపుబ్బా నవ్వించాడని, అలాగే దేవసేన అనుష్క నటన సినిమాకి మరో హైలెట్ అని అన్నాడు. అంతే కాకుండా చిత్ర డైరెక్టర్ మహేష్ బాబు ని కూడా స్పెషల్ గా విష్ చేసారు.

- Advertisement -

అయితే చాలా ఈవెంట్స్ చేస్తున్నా, పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నా, ఇంత వరకు పెద్దగా హైప్ రాలేదు. తాజాగా ఫస్ట్ పాజిటివ్ ట్వీట్ రిలీజ్ కి ముందే మెగాస్టార్ నుండి రావడంతో సినిమాకి మంచి బూస్టప్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు. సినిమాకి ఎలాగో పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి, కొంచెం మౌత్ టాక్ వచ్చినా హిట్ కావడం కంఫర్మ్ అంటున్నారు జనాలు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు