Bigg Boss season7: బిగ్ బాస్ ఆట మొదలు పెట్టిన హీరో శివాజీ

Bigg Boss season7

తెలుగు అతిపెద్ద టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎట్టకేలకు మొదలైంది. గొడవలకు, కాంట్రోవర్సీలకు కేంద్ర బిందువైన ఈ షో ఎప్పుడు మొదలైన కూడా అందరిలో ఒకింత ఆసక్తి ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం సీజన్ సెవెన్ విషయంలో కూడా అదే జరుగుతుంది.

సెప్టెంబర్ 3న అట్టహాసంగా మొదలైన మొదటి రోజు ఆట గురించి మాట్లాడుకుంటే.. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో కంటిస్టెంట్స్ కాస్త మెచ్యూరిటీ ఉన్నవాళ్లే వచ్చారనిపిస్తోంది. అనవసరమైన డ్రామాలు ఏమి చేయకుండా ఎవరి గేమ్ వాళ్ళు బాగానే ఆడుతున్నారు.

ఇక హీరో శివాజీ విషయానికొస్తే… మొదటి రోజు నామినేషన్స్ నుంచే తన ఆట మొదలు పెట్టేసాడు. అసలు హీరో శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వడం పైనే ఒక రకంగా అందరు షాక్ కు గురవ్వగా..కానీ శివాజీ మాత్రం ప్రేక్షకులను తనదైన మాటలతో, చేష్టలతో షోలో అందరిని ఆకట్టుకుంటున్నాడు. నిన్న రిలీజ్ చేసిన బిగ్ బాస్ మొదటి రోజు ప్రోమోతో బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ పై అందరిలో ఆసక్తి కలుగగా.. ఇక ఎపిసోడ్ కూడా అంతే ఎంటర్టైనింగ్ గా గడించింది.

- Advertisement -

బిగ్ బాస్ షోలో అందరికి ఫెవరెట్ అయిన నామినేషన్ ప్రాసెస్ విషయానికొస్తే అందరి నామినేషన్ పెద్దగా ట్విస్ట్స్ ఏమి లేకుండా సాఫీగానే సాగాయి.. అయితే హీరో శివాజీ నామినేషన్ ప్రక్రియ మాత్రం కాస్త ఆసక్తి రేపిందని చెప్పవచ్చు. హీరో శివాజీ మొదటి నామినేషన్ గా.. సింగర్ దామిని ని మరియు గౌతమ్ కృష్ణ ను నామినేట్ చేసాడు. అయితే ఈ ఇద్దరినీ నామినేట్ చేయడానికి శివాజీ చెప్పిన రీజన్ ను కూడా ఎవరు హర్ట్ చేయకుండా డీసెంట్ గానే చెప్ప్పాడు. దాంతో హీరో శివాజీ మీద అందరికి పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. అయితే శివాజీ ఇచ్చిన రీజన్ కు మాత్రం సింగర్ దామిని కాస్త హర్ట్ అయింది. మొదటి నామినేషన్ కాబట్టి లైట్ తీసుకుంటున్న అని శివాజీకి తన స్టైల్ లో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక గౌతమ్ కృష్ణ మాత్రం శివాజీ చెప్పినదానికి పెద్దగా హర్ట్ అవకుండా సైలెంట్ అయిపోయాడు.

దీన్నిబట్టి చూస్తే హీరో శివాజీ బిగ్ బాస్ టైటిల్ కొట్టడానికి సాలిడ్ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నడనిపిస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు