Rajinikanth VS Vijay Thalapathy: కోలీవుడ్ కోటలో అగ్గి రాజుకుంటుంది

Rajinikanth VS Vijay Thalapathy

కోలీవుడ్‌లో టాప్ హీరో ఎవరు? సూపర్ స్టార్ ఎవరు? కోలీవుడ్‌లో రికార్డులు బద్దలు కొట్టే సత్త ఎవరికి ఉంది? మొత్తంగా కోలీవుడ్ కింగ్ ఎవరు? ఈ ప్రశ్నలు గత కొన్ని రోజుల నుంచి తమిళ నాట ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ప్రశ్నలు అన్నీ ఇండస్ట్రీల్లో వినిపిస్తాయి. అందుకు కోలీవుడ్‌కి ఏమీ మినహాయింపు లేదు. అయితే, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే… ఇటీవల జైలర్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు… దాని తర్వాత జరిగిన చర్చ… రీసెంట్‌గా రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి తమిళ నాట ఈ ప్రశ్నలు చర్చకు వచ్చాయి.

జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో “ఈ మధ్య కాలంలో ఎవరెవరో సూపర్ స్టార్ ట్యాగ్‌ను యూజ్ చేసుకుంటున్నారు.. అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది” అంటూ రజినీకాంత్ కామెంట్స్ చేశాడు. అలాగే ప్రొడ్యూసర్ కళానిధి మారన్… “సూపర్ స్టార్ అంటే రజినీకాంత్ ఒక్కరే. ఈ ట్యాగ్ మరెవరి సొంతం కాదు. దానికి ఎవరూ అర్హులు కాదు” అంటూ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ ట్యాగ్ పై చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా ఇలయదళపతి విజయ్‌ని టార్గెట్ చేసేలా ఉన్నాయని కొందరి వాదన.

ఈ కామెంట్స్ వచ్చిన తర్వాత తమిళనాట విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది సద్దుమణుగుతుంది అని అనుకునే సమయంలో, రాఘవా లారెన్స్ మరోసారి అగ్గి అజ్యం పోశారు. “సూపర్ స్టార్ ట్యాగ్‌ను విజయ్ యూజ్ చేయడం లేదు. ఆయన ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటున్నారు. దానిలో తప్పు ఏం ఉంది” అంటూ కామెంట్స్ చేశారు.

- Advertisement -

అప్పటి నుంచి ఈ చర్చ సూపర్ రజినీకాంత్ ఫ్యాన్స్, ఇళయదళపతి విజయ్ ఫ్యాన్స్ మధ్య తెగ జరుగుతుంది. సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతే కాదు, కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ అని రజినీ ఫ్యాన్స్ అంటే, అసలైన సూపర్ స్టార్ విజయ్ అంటూ దళపతి ఫ్యాన్స్ పోస్ట్ లు చేస్తున్నారు.

ఇద్దరి రీసెంట్‌గా వచ్చిన జైలర్ మూవీ కలెక్షన్లను, అలాగే వారీసు మూవీ వసూళ్లను కంపేర్ చేస్తున్నారు. కోలీవుడ్ లో విజయ్‌ని సూపర్ స్టార్ రజినీకాంత్ దాటేశాడని ఓ వర్గం పోస్టులు పెడుతుంటే, నార్త్ ఇండియాలో వారీసు కలెక్షన్లను ఎవరూ టచ్ చేయలేదు అంటూ మరో వర్గం ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అలాగే విజయ్ లియో మూవీతో వచ్చే రికార్డులను టచ్ చేయడం ఎవరితోనూ సాధ్యం అవ్వదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇలా ప్రస్తుతం కోలీవుడ్ (Kollywood) లో ఫ్యాన్స్ వార్‌తో ఒక వేడి వాతావరణం ఏర్పడింది.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie updates, and Movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు