Suma Kanakala: సుమ కొత్త అవతారం… టెన్షన్‌లో రాజీవ్ కనకాల

Suma Kanakala

బుల్లితెర స్క్రీన్ పై గలగల మాట్లాడుతూ యాంకర్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారని చేసి చూపించింది సుమ కనకాల. పద్దతిగా కట్టు బొట్టు పెట్టుకుని తన మాటలతోనే గారడీ చేస్తుంది. యాంకర్ల క్యాటగిరిలో సుమ మెగాస్టార్ అని చెప్పొచ్చు. అంతే కాదు, రాబోయే యంగ్ యాంకర్లు అందరికీ సుమ కనకాల ఒక రోల్ మోడల్.

నిజానికి సుమ తెలుగు అమ్మాయి కాదు. ఎక్కడో కేరళ నుంచి వచ్చి, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంటే, తెలుగు భాషాభిమానులు కూడా ఆశ్చర్యపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా స్టార్ యాంకర్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో కొన్ని ఫోటోలు కూడా పెట్టింది. ఈ ఫోటోల్లో సుమ ఎప్పుడు కనిపించని, ట్రెడీ వేర్‌లో కనిపించింది. అంతే కాదు, సరికొత్తగా ఫోజులు కూడా ఇచ్చింది. అయితే సుమ ఎప్పుడైన సంప్రదాయ బద్దమైన దస్తులు ధరిస్తూ అచ్చ తెలుగు ఆడపిల్లలా నిండుగా కనిపిస్తుంది.

కానీ, సడన్‌గా సుమ ట్రెండీ వేర్ లో కనిపించే సరికి నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. తెలుగుదనాన్ని కాపాడేవాళ్లు సుమ ఒక్కరు అనుకునే వాళ్లమని, ఇప్పుడు సుమ కూడా అందరిలా అయిపోయిందని కొంత మంది కామెంట్ చేయగా, మరి కొందరు, సంప్రదాయ బద్దమైన డ్రెస్‌లు అయినా, ట్రెండీ వేర్ అయినా సుమక్క లుక్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. అలాగే.. ఈ ట్రెండీ డ్రెస్ లో రాజీవ్ కనకాల చూస్తే సుమను మళ్లీ పెళ్లి చేసుకుంటారంటూ కామెడీ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే, సుమ కనకాల ట్రెండీ వేర్ వేసినా, ఎక్కడా గ్లామర్ షో చేయకుండా పద్దతిగా కనిపించడం అందరినీ కట్టిపడేస్తుంది. ఇలాంటి యాంకర్లే తెలుగు ఇండస్ట్రీకి కావాలంటు సుమ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు