Suma Kanakala : యాంకరింగ్ కు గ్యాప్..

యాంకర్‌ సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో టాప్ యాంకర్ ఎవరు అనగానే ఏ అనుమానం లేకుండా అందరూ చెప్పే మొదటి పేరు సుమ కనకాల. ఎంత పెద్ద కార్యక్రమం అయినా కూడా సుమ తన స్టైల్ లో హ్యాండిల్ చేస్తుంది. అలాగే వచ్చిన గెస్ట్ ఎంత పెద్దవారు అయినా వారి పైన జోక్స్ వేయగల యాంకర్ కేవలం సుమ మాత్రమే. అయితే కొంత కూడా గ్యాప్ లేకుండా షోలు అలాగే ఈవెంట్స్ అన్నీ చేస్తూ ఉంటుంది.

ఆడియన్స్ ను నవ్విస్తూ అట్రాక్ట్ చేయడం కేవలం సుమతోనే సాధ్యం అవుతుంది. కాంట్రవర్సీల జోలికి వెళ్లరు. హెల్తీ రిలేషన్ షిప్స్ మెయింటైన్ చేస్తుంటారు. తన టైమింగ్ లో మాటకారితనంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సుమ. ఇదంతా సరే, తాజాగా ఆమె యాంకరింగ్ కు గుడ్ బై చెప్పారంటూ.. ఒకటే వార్తలు. ఇప్పుడు ఆ వార్తలు బాగా వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల జరిగిన ఓ షోలో సుమ మాట్లాడుతూ, తాను యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నట్టు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని సుమ కన్నీళ్లు పెట్టుకుంటూ అనౌన్స్ చేశారు. ఈ మేరకు సదరు టీవీ ప్రొగ్రాం వారు ఒక ప్రోమోను విడుదల చేశారు. తాను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ప్రేమించారని సుమ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు.

- Advertisement -

ఆ తర్వాత సుమను ఆర్టిస్టులు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు