Jailer: అవే ప్రాఫిట్స్ దిల్ మావకి వస్తే సెకండ్ హ్యాండ్ “ఆల్టో” కూడా కొనివ్వరు

Jailer:

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా చేసిన లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ జైలర్‌. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ నిర్మించారు.

ఈ సినిమా సన్ పిక్చర్స్ కు మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. బీస్ట్ ఫెయిల్యూర్ తరువాత నెల్సన్ దర్శకుడిగా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమాతో. ఈ సినిమా భారీ హిట్ అయిన సందర్భంగా సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ ఖరీదైన కార్లను, విలువైన చెక్కులను బహుమతిగా అందిస్తున్నారు.

ఇప్పటికే రజినీకాంత్‌కు రూ.1.24 కోట్ల BMW X7 కారుతో పాటు రూ.100 కోట్ల చెక్కును కూడా అందించారు. డైరెక్టర్ నెల్సన్‌కు కూడా పోర్చే లేటెస్ట్‌ కారు (Porsche Car)ను, చెక్కును అందజేశారు. ఇక లేటెస్ట్గా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్(Anirudh Ravichander) కు చెక్ అందించారు కళానిధి మారన్. జైలర్ మూవీ సక్సెస్ కు అనిరుధ్ అందించిన మ్యూజిక్ మెయిన్ పిల్లర్ గా నిలిచింది. రీసెంట్ గానే ఈ వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -

ఇకపోతే ఈ వీడియోస్ , ఫొటోస్ చూసి కొందరు సోషల్ మీడియాలో అవే ప్రాఫిట్స్ దిల్ మోవకి వస్తే సెకండ్ హ్యాండ్ “ఆల్టో” కూడా కొనివ్వరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో కొంతమంది డైరెక్టర్స్ కి కొందరు నిర్మాతలు కార్లను గిఫ్ట్ ఇచ్చారు. కానీ వారిలో దిల్ రాజు అల ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి బహుశ ఇలాంటి కామెంట్స్ వినిపించి ఉండొచ్చు. ఏదిఏమైనా దిల్ రాజ్ లాంటి నిర్మాత ఉండటం వలనే ఈ రోజు సుకుమార్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ , సీతమ్మ వాకిట్లో లాంటి మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి అని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు