Bigboss7: సీరియల్ హీరోయినే.. కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదట?

Bigboss7:

బిగ్ బాస్ 7 ఈ మధ్యనే గ్రాండ్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 14మందికి పైగా కంటెస్టెంట్స్ వచ్చినప్పటికీ అందులో చాలా మంది కొత్త వారు, జనానికి తెలియని వారే ఉండడం గమనార్హం. హీరో శివాజీ, షకీలా వంటి పాత నటులు తెలిసినా రీసెంట్ గా క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఈ సారి రాలేదు. ఇక అందులోనే సీరియల్స్ కి చెందిన పలువురు నటీనటులు కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ఒకరు ప్రియాంకా జైన్.

మౌనరాగం, జానకీరాముడు వంటి సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అంతే కాక మౌనరాగం సీరియల్ లో తనతో నటించిన శివకుమార్ తో ప్రియాంక జైన్ రియల్ లైఫ్ లో ప్రస్తుతం ప్రేమలో ఉంది. అయితే సీరియల్ హీరోయిన్ అయిన ఈ ప్రియాంకని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదని మొదట్లోనే అలిగి కూర్చుంది. పైగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ , మరో అమ్మాయి రాతిక ని నామినేట్ చేస్తూ, రీసన్ కూడా అదే చెప్పింది. ఇకపోతే సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక బిగ్ బాస్ లో చాలా రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.

ఆడియన్స్ ఓట్లు కూడా అమ్మాయిల్లో తనకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రియాంక నటించిన జానకి రాముడు సీరియల్ హీరో అమర్ దీప్ కూడా తనతో పాటే బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ లో వీళ్ళిద్దరూ ఒక జట్టయ్యే అవకాశం లేకపోలేదు. ఇక బిగ్ బాస్ మొదటివారంలో హీరో శివాజీ డామినేషన్ ఫుల్ గా కనిపిస్తుందన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు