Prabhas: సలార్ వాయిదాతో ఆ డేట్ ని కబ్జా చేస్తున్న చిన్న సినిమాలు?

Prabhas:

టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా అనుకున్న టైం కి సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి మొదలుకొని రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా అనుకున్న సమయానికి రిలీజ్ కాకుండా వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా సలార్ కూడా నాలుగు నెలల ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది.

అయితే ప్రభాస్ నటించిన సలార్ పై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. కేవలం టీజర్ తోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు వేరే డేట్ ప్రకటించే పనిలో ఉన్నారు. అఫిషియల్ గా పోస్ట్ పోన్ అప్డేట్ రాకపోయినా దాదాపు సలార్ వాయిదా కంఫర్మ్ అనే అనిపిస్తుంది.

అందుకే చిన్న హీరోలు, నిర్మాతలు సలార్ డేట్ పై కన్నేశారు. ముందుగా కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 28కి ఫిక్స్ చేసేయగా, శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న పెదకాపు కూడా సెప్టెంబర్ 28 కి వచ్చేస్తున్నాడు. ఇక వీటితో పాటే ది వాక్సిన్ వార్, మ్యాడ్ అనే రెండు చిన్న సినిమాలు కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఇవేగాక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఆదికేశవ సినిమాను కూడా సెప్టెంబర్ కి తెచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఏది ఏమైనా సలార్ వాయిదా తో ఈ చిన్న సినిమాల రిలీజ్ కి ఊపిరి పోసినట్టయింది. అయితే సలార్ పోస్ట్ పోన్ వల్ల బోయపాటి స్కంద ను కూడా సెప్టెంబర్ 28న తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారని సమాచారం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు