Sharukh khan:1000 కోట్లే లక్ష్యంగా దిగుతున్న జవాన్?

Sharukh khan

బాలీవుడ్ ఈ ఏడాది మంచి పికప్ లోకి వచ్చిందని చెప్పాలి. చిన్న సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా భారీ కలెక్షన్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ కి ఊపిరి పోశాయి. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే పఠాన్ వంటి భారీ హిట్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్ చాలా ఏళ్లకు కం బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి జవాన్ అనే పాన్ ఇండియన్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి వస్తున్నాడు.

ఇక జవాన్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసాడని తెలిసిందే. ముందునుండి భారీ అంచనాలున్న ఈ సినిమాకు టీజర్, ట్రైలర్ ల రెస్పాన్స్ తో అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. పైగా అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. ఇక ఇప్పుడు పఠాన్ లాగే ఈ సినిమాతోనూ భారీ ప్రాఫిట్స్ టార్గెట్ గా రిలీజ్ చేస్తున్నారు. హిందీతో పాటు, తమిళ్, తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న ఈ సినిమాను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

దాదాపు 250కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని సమాచారం. ఇదివరకు పఠాన్ తో 1000కోట్ల వసూళ్లు అందుకున్న షారుఖ్ ఖాన్, ఇప్పుడు మరోసారి ఆ ఫీట్ ను సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అందుకే కేవలం నార్త్ లోనే కాకుండా సౌత్ లోనూ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్న షారుఖ్ ఖాన్ హైదరాబాద్ లో ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నాడు.

- Advertisement -

సౌత్ లోను మంచి ఫాలోయింగ్ ఉన్న షారుఖ్ ఖాన్ తెలుగు రాష్ట్రాల్లోనే 100కోట్ల వసూళ్లు అందుకోవాలని చూస్తున్నాడు. అంత వరకు హిందీ డబ్బింగ్ సినిమాకు అంటే కొంచెం కష్టమే. కానీ బ్రహ్మాస్త్ర, పఠాన్ లాంటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా వసూలు చేసాయి. అందువల్ల జవాన్ కి గనుక మంచి టాక్ వస్తే ఈ టార్గెట్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు