Businessman: ఆ హీరోయిన్ ని చీరలో చూడడమంటే మహేష్ బాబుకి చాలా ఇష్టమట..!

Businessman:

మహేష్ బాబు.. ఈ పేరులో ఏవో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి. టాలీవుడ్ మిల్కీ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఘట్టమనేని మహేష్ బాబు అంటే సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోకి మురారి సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పోకిరి సినిమాతో యాక్షన్ హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్ బాబు.

ఈ హీరో విషయంలో వయసు జస్ట్ నెంబర్ మాత్రమే. ఎంత వయసుకు వచ్చినా కాలేజీ బాయ్ లుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు. మహేష్ బాబు అందంపై ఇప్పటికీ చాలామంది హీరోలు కుళ్లుకుంటారు అనే వార్తలు కూడా ఎన్నోసార్లు వినిపించాయి. అంతేకాదు అమ్మాయిలు సైతం మహేష్ బాబు ఇంత అందంగా ఉండడానికి ఏం వాడతాడు, ఏం తింటాడు, ఆయన డైటింగ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఎంతో తహతహలాడుతుంటారు.

అలాంటి మహేష్ బాబుకి ఓ హీరోయిన్ చీర కట్టుకుంటే చాలా ఇష్టమట. ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్. వీరిద్దరూ కలిసి బిజినెస్ మెన్ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రంలోని చందమామ అనే సాంగ్ లో కాజల్ చీరలో మెరిసిన విషయం తెలిసిందే. అయితే చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావని కాజల్ కి కాంప్లిమెంట్ ఇచ్చారట మహేష్ బాబు. దీంతో కాజల్ ఎంతో అదృష్టవంతురాలు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు