Miss Shetty Mr Polishetty: పెళ్లిపై హీరోయిన్ అనుష్క ఆసక్తికర కామెంట్స్

Miss Shetty Mr Polishetty:

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తెలుగు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది అనుష్క శెట్టి. అరుంధతి, బాహుబలి సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం దక్కించుకుంది.

ఆ తర్వాత చేసిన సైజ్ జీరో సినిమాతో కాస్త ఓటమి చూసింది. దీని తర్వాత చాలా కాలం సినిమాల్లో గ్యాప్ తీసుకున్న అనుష్క శెట్టి… మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో అలరించేందుకు రెడీ అయింది. అయితే, అరుంధతి సినిమాతో జేజమ్మగా ఎవరు అందుకొని గుర్తింపును తెచ్చుకుంది అనుష్క. అదే టైపు జోనర్ లో చేసిన పంచాక్షరి, భాగమతి సినిమాలు అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. కాగా, ఇప్పుడు మరో డిఫరెంట్ హారర్ సినిమాతో అనుష్క శెట్టి సిద్ధమవుతోంది.

‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది అనుష్క శెట్టి. అయితే, విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. పెళ్లికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటా’ అని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. దీంతో వరుడు ఎవరంటూ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు