Miss Shetty Mr Polishetty : ఎందుకురా ఫిల్టర్లు వేసి కష్టపడుతున్నారు, అక్క పాత్రో ,అత్త పాత్రో ఇచ్చేయొచ్చు కదా.

Miss Shetty Mr Polishetty

తెలుగు సినీ పరిశ్రమలో కొందరికి పర్టీక్లర్ గా ఒక టైం నడుస్తుంది.సూపర్ సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి.అతి తక్కువ కాలంలోనే హిట్స్ సాధించి మంచి గుర్తింపును సాధించుకుంది.స్టార్ హీరోలతో కూడా జతకట్టింది. స్వర్గీయ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అరుంధతి సినిమా అనుష్కను లేడి సూపర్ స్టార్ ను చేసింది.

లాస్ట్ గా అనుష్క చేసిన హిట్ సినిమా అంటే బాహుబలి అని చెప్పొచ్చు. బాహుబలి తరువాత వచ్చిన “రుద్రమదేవి” సినిమా కొంతమేరకు ఆకట్టుకుంది. ఆ సినిమా తరువాత అనుష్క చేసిన “సైజ్ జీరో” ఈ సినిమాకి కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం అనుష్క అప్పట్లో బాగా బరువు పెరిగింది. సినిమా కోసం బాగా కష్టపడినా కూడా ఆ సినిమా డిజాస్టర్ గానే మిగిలింది.

రీసెంట్ గా అనుష్క చేసిన భాగమతి , నిశబ్దం సినిమాలు కూడా పూర్తిగా ఆకట్టుకోలేదు. అనుష్క ప్రస్తుతం చేస్తున్న సినిమా “మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి” ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అనుష్క ను సన్నగా చూపించడానికి విఎఫ్ఎక్స్ టీం బాగా కష్టపడుతుందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా కొంచెం జూమ్ చేసి చూస్తే ఫిల్టర్లు వాడుతూ ఎడిటింగ్ పిక్స్ తో మేనేజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది గమనించిన కొంతమంది సోషల్ మీడియాలో ఎందుకురా ఫిల్టర్లు వేసి కష్టపడుతున్నారు, అక్క పాత్రో ,అత్త పాత్రో ఇచ్చేయొచ్చు కదా. అని చిన్నగా ట్రోలింగ్ మొదలుపెట్టారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు