Director Puri Jagannadh: పూరి ఫ్యాన్స్‌కి అలర్ట్… జన గణ మన వచ్చేస్తోంది

Director Puri Jagannadh

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్…
తక్కువ రోజుల్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలు తీసే సత్తా ఉన్నోడు…
ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్…
ఎంతో మంది హీరోలకు స్టార్ హీరో ఇమేజ్ ఇచ్చిన వాడు…
ఇంత చెప్పిన తర్వాత ఈ ఆర్టికల్ ఎవరి గురించో అర్థమై ఉంటుంది.

తెలుగు సినిమా పరిశ్రమలో పడిలేచిన కెరటం పూరీ జగన్నాథ్. ఎన్నిసార్లు పడినా… మళ్లీ తిరిగి లేవడం ఈయన స్టైల్. జీరో అయిన ప్రతిసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ హీరో అవుతుంటాడు. వరుసగా డిజాస్టార్స్ వస్తున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఒక్కసారిగా పైకి లేచాడు. మళ్లీ ఇప్పుడు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌కి గడ్డు రోజులు ఎదురవుతున్నాయి.

లైగర్ డిజాస్టార్ తర్వాత కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న పూరీ, ఇప్పుడు రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్2 (డబుల్ ఇస్మార్ట్) చేస్తున్నాడు. ఈ మూవీ పూరీ కెరీర్‌ని మళ్లీ లైన్‌లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో పూరీ తన తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

- Advertisement -

పూరీ చాలా రోజుల నుంచి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన అని చెబుతున్నాడు. దీన్ని తెరకెక్కించడానికి ఇప్పటికే రెండు సార్లు ట్రై చేశాడు. ఆ రెండు సార్లు కూడా ఫెయిల్ అయింది. ఫస్ట్ మహేష్ బాబుతో అనుకున్నాడు. తర్వాత విజయ్ దేవరకొండతో ప్లాన్ చేశాడు. విజయ్‌తో అయితే పూజా కార్యక్రమం… ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. కానీ, చివరికి ఆగిపోయింది. కారణమేదైనా, జన గణ మన మళ్లీ ఎప్పుడు ఉంటుంది అనేది పూరీ అభిమానుల ప్రశ్న.

అయితే వారికి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మనను పట్టాలెక్కిండానికి పూరి ప్రయత్నాలు స్టార్ట్ చేశాడట. తెలుగు హీరోలతో పని అవ్వడం లేదని ఈ సారి బాలీవుడ్ హీరోల వేటలో పడ్డారట పూరి. త్వరలోనే ఓ బీ టౌన్ హీరోను ఖాయం చేసుకుని, షూటింగ్ స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారట. మరీ పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరు ఉంటారో? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు