Jana Gana Mana: పట్టాలెక్కిన పూరి డ్రీం ప్రాజెక్ట్

పూరి జగన్నాధ్, చకచకా కథను రాసి తక్కువ రోజుల్లనే షూటింగ్ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చెయ్యడం ఈయన పద్ధతి. గన్ నుండి బుల్లెట్స్ బయటకి వచ్చినట్లు ఈయన పెన్ నుండి డైలాగ్స్ బయటకు వస్తాయి.
ఈయన సినిమాలలో హీరో కేరక్టరైజేషన్స్ అద్భుతంగా ఉంటాయి.
చంటిగాడు, పండు , బద్రి , సూర్య లాంటి కేరక్టర్స్ ను ఆడియన్స్ ఎప్పటికి మర్చిపోలేరు.

బద్రి సినిమాతో దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టిన పూరి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసాడు. ఒక దర్శకుడు దగ్గర ఎన్ని కథలు ఉన్న, తాను బలంగా నమ్మే కథ ఒకటి ఉంటుంది. పూరి జగన్నాధ్ దగ్గర ఉన్న అటువంటి కథే “జనగణమన” ఈ కథను వెండితెరపై ఆవిష్కరించడమే పూరి కల. పలు సందర్భాల్లో ఈ సినిమా నా డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు పూరి.

మహేష్ బాబు తో రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన పూరి,
ఈ ప్రాజెక్ట్ తో హ్యాట్రిక్ హిట్ కొడదామని ఫిక్స్ అయ్యాడు. కానీ వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ఫిలింనగర్ లో టాక్ నడిచింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ను పూరి విజయదేవర కొండతో చేస్తున్నాడు. కొందరు దర్శకులు ఆ హీరోనే కావాలని వెయిట్ చేస్తారు. కానీ పూరి జగన్నాధ్ కథనే హీరోగా నమ్మి, కేరక్టరైజేషన్ బలంగా రాసుకుని ముందుకు వెళ్ళిపోతాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 ఆగష్టు 3న రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు