Big boss season 7: బిగ్ బాస్ ప్రారంభం ఈరోజే..మొదటి రోజే ట్రేండింగ్ గెస్ట్‌లతో భారీ ప్లాన్

Big boss season 7

తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అతిపెద్ద టీవి రియాలిటీ షో బిగ్ బాస్ ప్రారంభానికి అంత సిద్ధమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో ఈరోజు సాయంత్రం నుంచి మా టివి లో ప్రసారం అవ్వబోతుంది.

గతకొద్ది రోజులుగా ఉల్టా పల్టా అంటూ ఆసక్తి కలిగించే ప్రోమోస్ తో సందడి చేసిన నాగార్జున మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోకి కంటిస్టెంట్స్ ను ఈరోజు నుంచి ప్రవేశ పెట్టనున్నాడు. గత ఆరు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే నాగార్జున ప్రోమోలలో చెప్పినట్టుగానే ఈసారి ఏడవ సీజన్ ఎక్కువ స్పైసిగా ఉండబోతుందని టాక్.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ పై గత కొద్దీ రోజులుగా వస్తోన్న కథనాల ప్రకారం ఈసారి హౌస్ లో 20 మంది కంటిస్టెంట్స్, రెండు వేరు వేరు హౌస్ లలో ఉండబోతున్నారట. ఇంతకు ముందెన్నడూ లేని సరికొత్త టాస్క్ లను ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ లో ఎక్కువగా కాంట్రవర్సీ లకే పెద్ద పీట వేయనున్నరట. కాగా ఈరోజు బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ కు ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ, మరియు నవీన్ పొలిశెట్టి లు గెస్ట్ లుగా రానున్నట్టు సమాచారం. దీనిబట్టి చూస్తే మొదటి రోజే బిగ్ బాస్ ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉన్నాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు