Indian 2 : ‘ఇండియన్‌-2’ నుంచి క్రేజీ అప్డేట్‌…అప్పుడే రిలీజ్?

Indian 2 :  చిత్ర పరిశ్రమంలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని క్రైమ్ కథ అంశాలతో సినిమాలు వస్తే… మరి కొన్ని హారర్ కథలతో దూసుకెళుతున్నాయి. ఇక కొన్ని సీక్వల్ సినిమాలు కూడా బ్రహ్మాండంగా హిట్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే భారతీయుడు సీక్వెల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇండియన్ 2 సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ భారతీయుడు రెండవ భాగాన్ని… దర్శకుడు శంకర్ ఎంతో కష్టపడి తీస్తున్నారు. సమయం ఎక్కువ తీసుకున్న సరే… మంచి కంటెంట్ ఇవ్వాలని నేపథ్యంలో ముందుకు వెళుతున్నారు. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు శంకర్. ఈ సినిమా షూటింగుకు ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా… ఒక్కొక్కటి దాటుకుంటూ ఈ సినిమాను ముందుకు సాగిస్తున్నారు దర్శకుడు శంకర్. లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

దాదాపు 400 కోట్ల రూపాయలతో ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి కోసం అదిరి పోయే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 12 పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారని తెలిస్తోంది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన సంచలన చిత్రం ‘ఇండియన్’ కు సీక్వెల్ ఇదన్న సంగతి తెలిసిందే. గత మూడేళ్ల నుంచి ఈ సినిమా ఎన్నో అవాంతరాలను అధిగమించి షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు