Prabhas’s Salaar: సలార్ ఎటు వెళ్లినా కష్టమే – మరో డిజాస్టర్ తప్పదా..?

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సీజీ వర్క్ ఆశించిన స్థాయిలో లేకపోవటమే ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వటానికి కారణమని తెలుస్తోంది. నవంబర్ లో సలార్ రిలీజ్ ఉంటుందంటూ టాక్ వినిపిస్తోంది కానీ, అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు.
అయితే, నవంబర్ లో సల్మాన్ ఖాన్ టైగర్2 సినిమా రిలీజ్ సిద్ధమవుతోంది. టైగర్2 కి బాలీవుడ్లో ఉన్న మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఆ టైమ్ లో రిలీజ్ చేయటం సలార్ సినిమాకి రిస్క్ అవుతుంది. ఇక డిసెంబర్లో రన్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందుతున్న యానిమల్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి డిసెంబర్ కూడా సలార్ కి సేఫ్ కాదనే చెప్పాలి.
ఇక మిగిలింది సంక్రాంతి, టాలీవుడ్ వరకూ అయితే సంక్రాంతి సినిమా రిలీజ్ కి బెస్ట్ సీజన్ అయినప్పటికీ నార్త్ లో మాత్రం కాదనే చెప్పాలి. ఈ క్రమంలో సలార్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సలార్ రిలీజ్ సమ్మర్ కి ఫిక్స్ అయితే, కల్కి 2898 AD ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి సలార్ సినిమా వాయిదా పడటం మేకర్స్ కి పెద్ద చిక్కు వచ్చి పడింది.
సలార్ సినిమా సెప్టెంబర్లోనే అయ్యుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వరద పారేది. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ కూడా ఇలాగే విఎఫెక్స్ విషయంలో సమస్యలతో వాయిదా పడి రిలీజ్ కాగా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వటం ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. సలార్ కి సంబంధించి ఒక్క గ్లిమ్ప్స్ మినహా ఏ అప్డేట్ లేకపోవడం, ఇప్పుడు రిలీజ్ పోస్ట్ పోనే అవ్వటంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి, అగమ్యగోచరంగా మారిన సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు