Thalapathy Vijay : దలపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా గురించి ఆయన అభిమానులతో పాటు సినిమా సినిమా ఇండస్ట్రి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. కానీ తాజాగా ఈ మూవీ మరో స్టార్ హీరో రిజక్ట్ చేసిన సినిమాతో రూపొందుతోంది అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఏ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన స్టోరీతో విజయ్ (Thalapathy Vijay) సినిమా రాబోతోంది ? ఆ హీరో ఎందుకు రిజెక్ట్ చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కమల్ రిజెక్ట్ చేసిన స్టోరీతో విజయ్ చివరి మూవీ (Thalapathy 69)?
దలపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి సినిమాకు తాత్కాలికంగా దలపతి 69 (Thalapathy 69) అని పేరు పెట్టారు. తమిళ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రాజకీయ అంశాలతో కూడిన యాక్షన్ చిత్రంగా రాబోతోంది. అయితే కమల్ హాసన్ పక్కన పెట్టిన ప్రాజెక్ట్ తో దర్శకుడు విజయ్ చివరి సినిమా (Thalapathy 69)ను తీస్తున్నాడు అనే టాక్ నడుస్తోంది ఇప్పుడు. దళపతి విజయ్‌తో కొత్తగా ప్రకటించిన చిత్రం నిప్పులు కురిపించే టార్చ్ పట్టుకున్న వ్యక్తి పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు. “అక్టోబర్ 2025లో డెమోక్రసీ టార్చ్ బేరర్ వస్తున్నాడు” అని మేకర్స్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మరోవైపు కమల్ హాసన్, హెచ్.వినోద్ కాంబోలో గతంలో అనుకున్న ప్రాజెక్ట్ కెహెచ్ 233 (KH233) అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇలాగే ఉంది. ఆ సమయంలో కమల్ ప్రాజెక్టు (KH233)కు సంబంధించిన అధికారిక ప్రకటనలో 37-సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌ను రిలీజ్ చేయగా, అచ్చం దలపతి 69లో విజయ్ పట్టుకున్నట్టుగానే కమల్ కూడా నిప్పులు కురుస్తున్న కాగడాను పట్టుకుని కన్పించారు. దీంతో ఈ రెండు సినిమాలు ఒక్కటేనని అనుకుంటున్నారు నెటిజన్లు. కమల్ పక్కన పెట్టేసిన స్టోరీతో వినోద్ విజయ్ చివరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది.
కమల్, వినోద్ (KH233) ప్రాజెక్టు ఆగిపోనట్టే?
నిజానికి ఈ రెండు ప్రాజెక్టులు సేమ్ ఉండడంతో అదే ఇప్పుడు హెచ్ వినోద్ కమల్ హాసన్ తో ఆగిపోయిన తన ప్రాజెక్ట్ ను రీక్రియేట్ చేసి, దళపతి విజయ్‌కి సరిపోయేలా కథను మార్చాడా అనే ఊహాగానాలకు దారి తీసింది. అయితే ఇది కేవలం యాదృచ్ఛికం కావచ్చు అనే కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి. ఎందుకంటే అసలు కమల్ ప్రాజెక్టు (KH233) ఆగిపోయిందా అనే విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కమల్ హాసన్, వినోద్ ప్రాజెక్టుకు KH233 అనే వర్కింగ్ టైటిల్ ను ప్రకటించారు. ఈ పాత్ర కోసం ఆయన శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ నుండి కమల్ తప్పుకున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. కాగా విజయ్ సినిమా (Thalapathy 69)కు సంబంధించిన నటీనటులను అధికారికంగా ప్రకటించలేదు. సిమ్రాన్ చాలా సంవత్సరాల తర్వాత విజయ్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనుంది అని పుకార్లు వినబడుతున్నాయి.