OG: చరణ్ ఫ్యాన్స్ ను కెలికిన సుజీత్ – ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు పాపం

OG

చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, తన మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ సినిమా తరువాత చేసిన మగధీర సినిమా అప్పట్లో అల్ టైం రికార్డ్. ఆ సినిమా చరణ్ ను తీసుకెళ్లి ఎక్కడో పెట్టింది. మగధీర సినిమా ఆ స్థాయిలో హిట్ కావడంతో, తరువాత వచ్చిన ఆరెంజ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా అప్పట్లో భారీ డిజాస్టర్. ఆ తరువాత వచ్చిన రచ్చ , నాయక్ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి.

నాయక్ తరువాత జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు చరణ్.ఈ సినిమా తెలుగులో తుఫాన్ పేరుతో విడుదలైంది. చరణ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరచిన సినిమా ఇది. ఈ సినిమా ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.?

పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఓజి గ్లిమ్ప్స్ రిలీజైన విషయం తెలిసిందే. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లిమ్ప్స్ రన్ అవుతుంది. సినిమాలో ఏ సందర్భంలో ఆ డైలాగ్ వస్తుందో తెలియదు కానీ “పదేళ్ల క్రితం ముంబై లో వచ్చిన తుఫాన్ గుర్తుందా” అని డైలాగ్ గ్లిమ్ప్స్ లో వినిపించింది. ఈ డైలాగ్ కొంతమంది చరణ్ ఫాన్స్ కి ఏదోలా అనిపిస్తుంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల అంటే 2013 లో చరణ్ నటించిన తుఫాన్ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా కూడా ముంబై బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది. అంతటి డిజాస్టర్ మర్చిపోయిన చరణ్ అభిమానులకి మళ్ళీ తుఫాన్ ను గుర్తుచేసినట్లు అయింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు