Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సూర్య (Suriya) ఓ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీలో భాగం కాబోతున్నాడు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ వార్త మాత్రం సూర్య (Suriya) అభిమానులకు నిరాశను కలిగించేదే.
క్రేజీ ఫ్రాంచైజీలో విలన్ గా..
బాలీవుడ్ ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధూమ్’ (Dhoom) ఫ్రాంచైజీకి బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మొదటి భాగం 2004లో వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో విలన్‌గా జాన్ అబ్రహం నటించగా, రెండో భాగంలో హృతిక్ రోషన్ విలన్‌గా నటించారు. అమీర్ ఖాన్ ‘ధూమ్ 3’ (Dhoom 3)లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. విలన్ గా, హీరోగా కన్పించాడు. అయితే అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలన్నింటిలో ఈ నేరస్థులను కనుగొనడానికి ప్రయత్నిస్తున్న పోలీసుగా నటించగా, ఉదయ్ చోప్రా సైడ్ క్యారెక్టర్ చేశారు. తాజాగా యశ్ రాజ్ బ్యానర్ ‘ధూమ్ 4’ (Dhoom 4)ని రూపొందించాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం కథ సిద్ధమవుతుండగా, దీన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ‘ధూమ్ 4’ (Dhoom 4)లో సూర్య (Suriya) కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి సూర్య ఇంతకు ముందు బాలీవుడ్ సినిమాలో నటించలేదు. మొట్టమొదటి సారి ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగం కావడమే కాకుండా విలన్ గా కూడా నటించబోతున్నాడు అనే వార్త తెగ వైరల్ అవుతోంది. మేకర్స్ ఇప్పటికే సూర్య (Suriya)తో దీని గురించి సంప్రదింపులు జరపగా, సూర్య కూడా ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడని, ఇందులో ఆయన నటనా స్టామినా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనుందని సూర్య (Suriya) ఫ్యాన్స్ తెగ సంబర పడ్డారు.
నిజం ఏంటంటే?
సూర్యతో ధూమ్ 4 (Dhoom 4) గురించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన రావచ్చనే రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. కానీ అందరినీ నిరాశపరిచే విధంగా ఈ వార్తలు నిజం కాదని తెలిసింది. ప్రస్తుతం సూర్య తన 44వ సినిమాతో సహా తన ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇందులో నటించే ఛాన్సే లేదని సమాచారం. మరి ధూమ్ 4 (Dhoom 4)లో విలన్ పాత్రను ఎవరు పోషిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా ధూమ్ ఫ్రాంచైజీ ఇటీవలే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ పోస్ట్‌తో మేకర్స్ ధూమ్ 4 (Dhoom 4) రాబోతోందని ప్రకటించారు.
ఇక నెగెటివ్ రోల్స్ చేయడం సూర్య (Suriya)కి కొత్త కాదు. ’24’లో ఆయన త్రిపాత్రాభినం చేసాడు. అందులో ‘ఆత్రేయ’ పాత్ర ఐకానిక్‌గా మారింది. కమల్ హాసన్ ‘విక్రమ్’లో రోలెక్స్‌గా అదరగొట్టాడు. సినిమా చివరి నిమిషాల్లో కనిపించి అందరూ భయపడే గ్యాంగ్‌స్టర్‌గా మారిపోయాడు. లోకేశ్ సినిమా యూనివర్స్‌లో మోస్ట్ ఎవైటెడ్ క్యారెక్టర్‌లలో రోలెక్స్ కూడా ఒకరు.