Anushka: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ ఎప్పుడంటే…!

లేడి సూపర్ స్టార్ అనుష్క నిశ్శబ్దం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటిస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అనుష్క, నవీన్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుండి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమాకు సంబందించిన ప్రోమోలు, లిరికల్ సాంగ్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతున్నప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు సినిమా యూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.

రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాను ఆగస్టు 4న రిలీజ్ చేసేందుకు నిర్ణయించిందట సినిమా యూనిట్. ఈ మేరకు అఫీషియల్ అనౌన్సమెంట్ కూడా త్వరలోనే రానుందని సమాచారం. జాతి రత్నాలు తర్వాత నవీన్ నటించిన సినిమా కావటం, అనుష్క చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనుండటంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ కి ఈ వేసవిలో సరైన హిట్ లేకపోవటం, ఎన్నో అంచనాలతో వచ్చిన ఆదిపురుష్ కూడా పెద్దగా అలరించకపోవటం వల్ల బాక్సాఫీస్ వద్ద వ్యాక్యూమ్ ఏర్పడింది. ఈ అంశం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి. ఇక ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సందర్బంగా భోళాశంకర్, జైలర్ వంటి సినిమాలు సెకండ్ వీక్ లో రిలీజ్ అవుతున్నాయి. మొదటి వారం ఎలాగో థియేటర్లు ఖాళీ కాబట్టి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే సూపర్ హిట్ ఖాయం అని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు