Sukumar: చిన్న సినిమాకి ఇంప్రెస్ అయిన స్టార్ డైరెక్టర్ ..!

డైరెక్టర్ సుకుమార్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయటంలో ముందుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య వరుసగా తన శిష్యులు డైరెక్టర్లుగా మారడం, వారంతా మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్స్ అందుకోవటమే ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. అయితే, తనకు ఏ మాత్రం సంబంధం లేని ఒక చిన్న హీరో సినిమా టీజర్ నచ్చటంతో సుకుమార్ ఆ సినిమా యూనిట్ సెట్స్ కి పిలిపించి మరీ అభినందించాడు. ఆ సినిమా మరేదో కాదు, ఆర్య, అతడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతున్న దీపక్ సరోజ్ హీరోగా నటించిన ‘సిద్దార్థ్ రాయ్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఇంప్రెస్ అయిన సుకుమార్, సినిమా టీమ్ ని అభినందించటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

యశస్వి డైరెక్షన్ చేసిన ఈ సినిమా టీజర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమా గుర్తొచ్చిందని, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ గుర్తు చేసుకొని మరీ, సుకుమార్ ప్రశంసించటంతో  సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సుకుమార్ చెప్పినట్టుగానే ఈ సినిమా అర్జున్ రెడ్డి స్ఫూర్తితోనే తీసినట్లు అనిపిస్తుంది.

మొత్తానికి టీజర్ తోనే సుకుమార్ లాంటి జీనియస్ డైరెక్టర్ ని మెప్పించటం ఈ సినిమా యూనిట్ కి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు. దీపక్ సరోజ్, తన్వి నేగి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రధన్ మ్యూజిక్ అందించాడు. మరి, టీజర్ తోనే సుకుమార్ దృష్టిని ఆకర్షించి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు