Miss Shetty Mr Polishetty: అనుష్క ప్రమోషన్స్‌కు దూరం… నవీన్ పొలిశెట్టి క్లారిటీ !

Miss Shetty Mr Polishetty

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రిలీజ్ కు ఇంకా రెండు రోజులే ఉన్నప్పటికీ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్క మాత్రం ఇంతవరకు ఒక్క ప్రమోషన్ ఈవెంట్ లో కూడా పాల్గొనలేదు. నవీన్ పొలిశెట్టి ఒక్కడే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. దాంతో అనుష్క ప్రమోషన్స్ కు ఎందుకని రావడం లేదని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో హీరో నవీన్ పొలిశెట్టి ఈ విషయంపై అందరికి క్లారిటీ ఇచ్చారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి మరియు అనుష్క జంటగా నటిస్తోన్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి . దాదాపు సంవత్సరం నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 7 న కృష్ణాష్టమి సందర్భంగా రిలీజ్ అవబోతుంది. దాంతో ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని నవీన్ పొలిశెట్టి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

కానీ నవీన్ పొలిశెట్టి కష్టానికి మాత్రం ఫలితం రావట్లేదనే చెప్పాలి. సినిమాలో స్టఫ్ లేదని ఆడియన్స్ ముందే క్లారిటీ వచ్చిందే లేక సినిమా పలు సార్లు వాయిదా పడటం ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందో తెలీదు గాని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు రావాల్సినంత బజ్ అయితే రావట్లేదు.

- Advertisement -

గతకొద్ది రోజులుగా వివిధ జిల్లాలలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్న నవీన్ పొలిశెట్టి నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుష్క సినిమా ప్రమోషన్స్ కు ఎందుకని రావడం లేదనే విషయానికి ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు.

అనుష్క ప్రస్తుతం ఊరిలో( అవుట్ ఆఫ్ స్టేషన్ ) లేనందున ఆమె ప్రమోషన్స్ కు రావడం లేదు. రీసెంట్ గానే అనుష్కతో కలిసి టీం అంత ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం త్వరలోనే ఆ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తామని నవీన్ పొలిశెట్టి క్లారిటీ ఇచ్చాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు