Laya: ఆ హీరో కారణంగా కెరీర్‌ నాశనం చేసుకున్న లయ?

Laya: తెలుగమ్మాయిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. తన అభినయంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి లయ. పికాసో చిత్రంలా.. ఎల్లోరా శిల్పంలా తెలుగు ప్రేక్షకులను మైమరిపించి పాతికేళ్ల క్రితమే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘భద్రం కొడుకో’ అనే సినిమాతో హీరోయిన్‌‌గా పరిచయమైన లయ.. ‘స్వయంవరం;’ సినిమాతో హిట్ హీరోయిన్‌గా మారింది. వేణు హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో లయకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుని, గ్లామర్ రోల్స్‌కు నో చెప్పి ఫ్యామిటీ ఆడియన్స్‌కు దగ్గరైంది. తన నటనతో, అందంతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన లయ పెళ్లయ్యాక నటనకు దూరమైంది. ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన లయ తాజాగా ఓ తెలుగు ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

“నేను అమెరికాలో అడుక్కుతింటున్నాని, రోడ్డున పడ్డాను అని, టీ అమ్ముకుంటూ బతుకుతున్నానని రూమర్స్ క్రియేట్ చేశారు. అవి చూసినప్పుడు చాలా బాధగా అనిపించేది. మా కుటుంబసభ్యులు కూడా చాలా బాధపడ్డారు” అని లయ వాపోయింది. ఇక.. తాను చేసిన ఓ మిస్టేక్ వల్లే కెరీర్ అనుకున్నంత స్పీడ్ అందుకోలేదని ఆమె తెలిపింది.

- Advertisement -

“నేను నటించిన స్వయంవరం సినిమా రిలీజై 25 ఏళ్లు అయింది. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సూపర్ హిట్ మూవీ తర్వాత నేను ‘మా బాలాజీ’ అనే సినిమాలో విడో పాత్ర చేసి తప్పు చేశానని అనిపించింది” అని లయ చెప్పింది. వడ్డే నవీన్ హీరోగా నటించిన ‘మా బాలాజీ’ మూవీ ఎన్నో అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా తర్వాత లయ కెరీర్‌కు పెద్ద బ్రేక్ రాగా వడ్డే నవీన్ కెరీర్ పూర్తిగా క్లోజ్ అయింది. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ అనే సినిమాలో చివరగా కనిపించిన లయ.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. లేటెస్ట్‌గా నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు