Tollywood : ఈ వారం థియేటర్లో వస్తున్న సినిమాలు.. రెండనుకుంటే రీ రిలీజ్ తో కలిపి లిస్ట్ పెద్దదే..!

Tollywood : టాలీవుడ్ లో గత రెండు నెలలుగా సరైన సినిమా లేక థియేటర్లు బోసిపోయాయని తెలిసిందే. వచ్చిన చాలా సినిమాలు ప్లాప్ కాగా, పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. దాదాపుగా చిన్న సినిమాలే రిలీజ్ కాగా, ఇప్పటివరకు సరైన సక్సెస్ లు దక్కలేదు. ఇక తాజాగా ఐపీఎల్ సీజన్ కూడా ముగింపుకు చేరుకుంది. అలాగే ఎన్నికలు కూడా ముగిసాయి కాబట్టి, ఈ వారం నుండి థియేటర్లలో మెల్లిగా సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఈ వారం పెద్దగా సినిమాలు ఏమి ఉండవు అని అనుకున్నారు చాలా మంది. ఏదో దిల్ రాజు అన్న కొడుకు సినిమా, గెటప్ శీను సినిమాలు తప్ప ఏమి లేవనుకుంటే, అన్ని రకాల సినిమాలు లెక్కేస్తే ఈ వారం 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక అయితే అన్ని చిన్న చిన్న సినిమాలే కావడం గమనార్హం. ఇక ఆ సినిమాలు ఏవో ఒక్కసారి లెక్కేస్తే..

List of Tollywood movies releasing in theaters this week

లవ్ మీ :

దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 25 న సినిమా రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

రాజు యాదవ్ :

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను హీరోగా నటించిన ఈ సినిమాను కృష్ణమాచారి దర్శకత్వం వహించగా, మే 24న ఈ సినిమా విడుదల అవుతుంది.

క్రిమినల్ ఆర్ డెవిల్ :

ఆదా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సస్పెన్స్ థిల్లర్ గా తెరకెక్కగా, మే 24న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

డర్టీ ఫెలో :

శాంతి చంద్ర, దీపికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 24న రిలీజ్ కాబోతుంది.

బిగ్ బ్రదర్ :

శివ కాంతామనేని, శ్రీ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మే 24న రిలీజ్ అవుతుంది.

సిల్క్ సారి :

వాసుదేవరావు, రీవా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఎంటర్టైనర్ మూవీ మే 24న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

వ్యాన్ :

తమిళ్ హీరో మగేష్ హీరోగా నటించిన ఈ యాక్షన్ సినిమా మే 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఫురియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా :

అన్య టేలర్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన ఈ హాలీవుడ్ యాక్షన్ మూవీ మే 24న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

మనం రీ రిలీజ్ :

ఇక అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన ఈ సినిమా పదేళ్ల కింద రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సందర్బంగా ఈ వారం మే 23నుండే ప్రీమియర్స్ తో రీ రిలీజ్ చేసారు.

ఖైదీ రీ రిలీజ్ :

కోలీవుడ్ స్టార్ కార్తీ బర్త్ డే స్పెషల్ గా తన సూపర్ హిట్ సినిమా ఖైదీ ని రీ రిలీజ్ మే 25న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ వారం రిలీజ్ అవుతున్న (Tollywood) సినిమాల్లో కాస్త అంచనాలు ఉన్న సినిమాలంటే, లవ్ మీ, రాజు యాదవ్ సినిమాలనే చెప్పాలి. అలాగే మనం, ఖైదీ రీ రిలీజ్ సినిమాలు కూడా మంచి అంచనాలతో రీ రిలీజ్ అవుతున్నాయి. మిగతా సినిమాలు టాక్ ని బట్టే ఆడే అవకాశం ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు