Sai Durga Tej Gift to Pawan Kalyan : సాయి దుర్గ తేజ్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేయాలా… ఆడుకోవాలా..?

Sai Durga Tej Gift to Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై…ఆ తర్వాత బద్రి సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. ఇంకా దాదాపు చాలామంది డైరెక్టర్లతో కలిసి పని చేసిన ఈయన.. గుడుంబా శంకర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి తన స్టామినా నిరూపించారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.. అందులో భాగంగానే తనను సినిమాల ద్వారా ఆదరించిన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.. అందులో భాగంగానే తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొద్ది రోజులకు 2011లో జనసేన అంటూ సొంతంగా పార్టీని స్థాపించి అధికారంలోకి రాకపోయినా.. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూనే రైతులకు అండగా నిలిచారు…

ముఖ్యంగా పంట నష్టపోయి.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. 2024లో కూటమి తరపున పోటీ చేసి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు మెగా కుటుంబ సభ్యులు ఇటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ అభిమానాన్ని బహుమతుల రూపంలో అందజేస్తున్న విషయం తెలిసిందే.

Lego Star War 75192 ను బహుమతిగా అందించిన సాయి దుర్గ తేజ్..

Sai Durga Tej Gift to Pawan Kalyan : Sai Durga Tej.. Now should Pawan Kalyan do public service... play..?
Sai Durga Tej Gift to Pawan Kalyan : Sai Durga Tej.. Now should Pawan Kalyan do public service… play..?

ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ వదిన సురేఖ రూ.2.60 లక్షల విలువైన పెన్నును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విషయం ఇలా వైరల్ అవుతుండగా ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి దుర్గా తేజ్ తన మేనమామకు..Lego Star War 75192 ను బహుమతిగా అందించారట.. రూ.1,30,000 విలువచేసే అత్యంత క్లిష్టమైన ఫజిల్ ను బహుకరించినట్లు సమాచారం. అయితే ఈ Lego Star War 75192 అంటే ఏమిటి? ఎందుకు బహుమతిగా ఇచ్చారు? అంటూ నెటిజన్లలో రకరకాల ప్రశ్నలు మొదలవుతున్నాయి.. అసలు ఏంటిది? దీనిని ఎలా ఉపయోగించాలి? అసలు దేనికి ఉపయోగిస్తారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం

- Advertisement -

Lego Star War 75192 అంటే ఏమిటి..?

జర్మన్ కి చెందిన ఈ లెగో కంపెనీ స్టార్ వార్ అనేది ఒక టాయ్ .. ఇది వినోద భరితమైనదే కాదు..మన మెదడుకు పదును పెట్టాల్సిందే.. ఇది ఒక ఫజిల్.. దీనిని సాల్వ్ చేయడం అంత సులభం కాదు.. చాలా తెలివితేటలు ఉండాలి.. ముఖ్యంగా దీనిని ఫామ్ చేయడానికి 465 పేజీల గైడ్ ఉంటుంది.. దీనిని పూర్తిగా చదివిన తర్వాత ఈ స్టార్ వార్ ను సరిగ్గా అమర్చితే స్టార్ వార్ షిప్ రెడీ అవుతుంది..

పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేయాలా? లేక ఆడుకోవాలా..?

ఇకపోతే ఈ పజిల్ ను సాల్వ్ చేయడం కోసం ఇచ్చిన పుస్తకమే 465 పేజీలు ఉంటే .. ఇక దానిని చదివి అర్థం చేసుకొని అమర్చడానికి ఇంకెంత సమయం పడుతుందో.. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలే అత్యంత క్లిష్టమైన పదవి.. పైగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవులను పక్కనపెట్టి.. దీనిని సాల్వ్ చేసుకుంటూ ఉంటారా.. అసలు పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేయాలా? లేక ఆడుకోవాలా? అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి సాయి దుర్గా తేజ్ ఇచ్చిన ఈ ఫజిల్ కి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇలాంటి వస్తువులు బహుమతిగా అందించి సాయి దుర్గా తేజ వార్తల్లో నిలిచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు