Pawan Kalyan: అకీరాకు అరుదైన గౌరవం..ఉహించలేదుగా..!

Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 13 సంవత్సరాల కష్టం తర్వాత ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇక ఈయన గెలుపుతో రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. ఇన్నాళ్లు బయట ప్రపంచానికి పెద్దగా తెలియని పవర్ స్టార్ పవన్ కొడుకు అకీరా కూడా ఇప్పుడిప్పుడే బయట తిరుగుతూ అందరిని ఖుషీ చేస్తున్నారు. తాజాగా అకీరాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా అకీరాకు దక్కిన అరుదైన గౌరవాన్ని చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

హైదరాబాదులో గ్రాండ్ వెల్కమ్..

Pawan Kalyan: A rare honor for Akira..unexpectedly..!
Pawan Kalyan: A rare honor for Akira..unexpectedly..!

అసలు విషయంలోకి వెళితే.. తాజాగా హైదరాబాదులో అకీరా ప్రత్యక్షమయ్యాడు.. తన తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా రీ రిలీజ్ కోసం దేవి థియేటర్ కి వచ్చాడు అకీరా.. పవర్ స్టార్ పవన్ వారసుడు రాకతో అభిమానులలో ఉత్సాహం ఉరకలు వేసింది.. అకీరా కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఘనంగా రిసీవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు… ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.. మొత్తానికైతే అకీరాను అనఫీషియల్ గా అనౌన్స్ చేసేసాడు పవన్ కళ్యాణ్..

అకీరా టాలెంట్..

అకీరా టాలెంట్ విషయానికి వస్తే.. తండ్రి లాగే మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరాడు.. అలాగే డాన్స్ మాత్రమే కాదు పియానో వాయించడంలో కూడా దిట్ట.. మంచి ఎడిటింగ్ అనుభవం కూడా ఉంది.. ఇలా అన్ని విషయాల్లోనూ ప్రావీణ్యం పొందిన అకీరా ఇంతకుముందు అప్పుడప్పుడు కనిపించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ రోజు నుంచి అకీరా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు తన తండ్రి పవన్ కళ్యాణ్ మంత్రి అవ్వడంతో అకీరాకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ రోజు నుంచి వార్తల్లో నిలుస్తున్న అకీరా.. తన పిన్ని అన్న లెజినోవాతో కలిసి విజయానందం పంచుకోవడం దగ్గరనుంచి గెలుపు రోజు చంద్రబాబుతో భేటీ.. ప్రధానితో మీటింగ్.. చివరికి చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడం ఇలా పవన్ ప్రతి అడుగులోనూ అకీరా కనిపించాడు.. దాంతో అకిరా పాత్ర ఇక అఫీషియల్ అయినట్టే అని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్.. ఇక పవన్ కళ్యాణ్ కొడుకుగా ఇండస్ట్రీ రాక కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు మరి ఆ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

పవన్ కళ్యాణ్ కెరియర్..

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద పాత్ర పోషిస్తున్నారు.. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు.. ఇక మునుముందు ఆయన సినిమాలు చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చేమో.. త్వరలో హీరోగా లాంచ్ చేసినా మనం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.. మరి అకీరానందన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు… మరి అభిమానులకు ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాలి. మొత్తానికైతే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తన కొడుకును భారీగా వైరల్ చేసేసారు.. దీంతో హైదరాబాద్లో అడుగుపెట్టగానే అకీరాకు పవన్ అభిమానుల నుంచి ఊహించని గౌరవం లభించడం ఆశ్చర్యంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు