Thammudu ReRelease : మళ్లీ రీ రిలీజ్ అయినా అంచనాల్ని మించిపోయిన డే 1కలెక్షన్స్…

Thammudu ReRelease : టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ మరీ కామన్ అయిపొయింది. ఈ మధ్య అన్ని రకాల సినిమాలు వచ్చి థియేటర్లలో ఇరగదీస్తున్నాయి. ఈ ఏడాది సరైన కొత్త సినిమాలు రిలీజ్ కాకపోగా, రీ రిలీజ్ సినిమాల రాజ్యమైపోయింది. ఇక మొన్నామధ్యనే ఎన్టీఆర్ ఆది సినిమా రీ రిలీజ్ కాగా, రవితేజ వెంకీ లాంటి నార్మల్ మూవీస్ కూడా థియేటర్లలో దుమ్ములేపాయి. సరిగ్గా చెప్పాలంటే దాదాపుగా ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ రెండు ఏళ్ల క్రితం ఓ రేంజ్ లో టాలీవుడ్ ను ఊపేసింది. పోకిరితో మొదలుపెట్టి వరుస బెట్టి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, క్రమంగా రీ రిలీజ్ లు మరీ ఎక్కువ అయిపోవడంతో ఆడియన్స్ లో రీ రిలీజ్ ల మీద ఆసక్తి కంప్లీట్ గా తగ్గిపోయి, రీసెంట్ టైంలో వచ్చిన సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఈ మధ్య బర్త్ డే స్పెషల్స్ లా కాకుండా మరీ సినిమా అనివెర్సరీ ల పేరిట సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. మొన్నామధ్య బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి రిలీజ్ అయి పాతికేళ్ళు అయిన సందర్బంగా రీ రిలీజ్ చేసారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు ని కూడా పాతికేళ్ళు పూర్తయిన సందర్బంగా రీ రిలీజ్ చేసారు.

Thammudu Movie Re Release Collections

రీ రిలీజ్ లో మళ్ళీ అంచనాలని మించిపోయింది…

ఇక ప్రస్తుత సమయంలో అంటే… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ “తమ్ముడు” (Thammudu Re Release) మూవీ రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా సినిమాను రీసెంట్ గా థియేటర్లలో రీ రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ సినిమా రీ రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అవ్వగా RTC X రోడ్స్ లో సినిమాను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని రీ రిలీజ్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ షోలే వేసినా కూడా మొదటి రోజు బుక్ మై షో లో మొత్తం మీద 5.5 వేల టికెట్ సేల్స్ జరిగాయి. ఇక ఆఫ్ లైన్ లో కూడా తమ్ముడు సినిమాకి మంచి టికెట్ సేల్స్ జరగగా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో 35-40 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది తమ్ముడు సినిమా.

- Advertisement -

వీకెండ్ లో మరింత రావచ్చా?

ఇక రీసెంట్ టైంలో రీ రిలీజ్ మూవీస్ పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ను ఏమి చూపించలేదు. ఇలాంటి టైంలో రీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ రీ రిలీజ్ లో మంచి ఓపెనింగ్స్ తో ఇప్పటికీ రీ రిలీజ్ లకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని నిరూపించింది. అయితే తమ్ముడు ఇంతకు ముందే రెండేళ్ల కింద రీ రిలీజ్ కాగా, మళ్ళీ ఇప్పుడు రెండో సారి రీ రిలీజ్ అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో వీకెండ్ లో తమ్ముడు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు