Darshan Lawyer: పవిత్ర గౌడ ను దర్శన్ పెళ్లి చేసుకోలేదు.. లాయర్ కామెంట్స్ వైరల్..!

Darshan Lawyer.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కన్నడ హీరో దర్శన్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రేయసి కోసం ఏకంగా అభిమానిని హతమార్చారు అని తెలిసి.. ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు హీరో దర్శన్ ను అరెస్టు చేశారు. దీంతో ఈ విషయం కాస్త కలకలం సృష్టిస్తోంది..

సహజీవనమే కాదు పెళ్లికూడా..

Darshan Lawyer: Darshan did not marry Pavitra Gowda.. Lawyer comments viral..!
Darshan Lawyer: Darshan did not marry Pavitra Gowda.. Lawyer comments viral..!

అసలు విషయంలోకి వెళితే కన్నడ హీరో దర్శన్.. ప్రముఖ సీరియల్ నటి పవిత్ర గౌడను దాదాపుగా పదేళ్లపాటు ప్రేమించి.. ఆమెతో సహజీవనం చేసి పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. పవిత్ర గౌడ కు 54 సంవత్సరాల వయసు.. అయితే దర్శన్ కు 47 సంవత్సరాలు కావడం గమనార్హం.. పైగా పవిత్ర గౌడ కు పెళ్లీడుకొచ్చిన 18 సంవత్సరాలు కూతురు కూడా ఉంది.. అలాగే దర్శన్ కి కూడా 15 సంవత్సరాల కొడుకు ఉన్నాడు.. ఇలాంటి సమయంలో వీరిద్దరూ దాదాపు 10 ఏళ్లపాటు సహజీవనం చేస్తున్నారని.. పెళ్ళి కూడా చేసుకున్నారంటూ వార్తలు బలంగా వినిపించాయి.. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇక దీంతో దర్శన్ అభిమానులు పవిత్ర గౌడపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ప్రశ్నించిన అభిమానిని హతమార్చిన దర్శన్..

అయితే వీరిలో ఒకరు రేణుక స్వామి అనే వ్యక్తి.. మా అన్న దర్శన్ జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వే.. నీ వల్లే తన భార్య నుంచి విభేదాలు వచ్చాయి అంటూ పవిత్ర గౌడను టార్గెట్ చేసి రకరకాల కామెంట్లతో రెచ్చిపోయాడు.. దీంతో అతడిని ఎలాగైనా సరే బంధించి కొట్టాలని పవిత్ర గౌడ తన పగను దర్శన్ పై రుద్దింది. ఆవేశం తట్టుకోలేకపోయినా దర్శన్ తన అభిమానులలో కొంతమందికి రూ .30 లక్షలు సుఫారీ ఇచ్చి రేణుక స్వామిని బంధించి హత్య చేశారు.. నిందితులను పోలీసులు పట్టుకోగా.. అసలు విషయం బయటకు వచ్చింది.. దీంతో ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ఛానల్ ఓపెన్ చేసిన దర్శన్, పవిత్ర గౌడలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాగా తాజాగా ఈ విషయాలపై దర్శన్ లాయర్ స్పందించారు..

- Advertisement -

దర్శన్ పవిత్రను పెళ్లి చేసుకోలేదు..

హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్.. సీరియల్ నటి పవిత్ర గౌడ కు పెళ్లి కాలేదని దర్శన్ లాయర్ అనిల్ తెలిపారు.. వాళ్ళిద్దరూ పార్టనర్స్ కాదని.. క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని తెలిపారు.. దర్శన్ రెండో పెళ్లి చేసుకోలేదని రేణుక స్వామి హత్యతో ఆయనకు సంబంధం లేదు అని.. హత్య జరిగిన చోట దర్శన్ కారు ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తోంది.. కానీ ఆ కారులో దర్శన్ లేరని.. పోలీసులు ఇంకా ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని.. మీడియాకు అనిల్ తెలిపారు.. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ… అటు దర్శన్ ఇటు పవిత్రను మళ్ళీ మళ్ళీ వైరల్ చేస్తున్నాయి ప్రముఖ మీడియా సంస్థలు. మరి దీనిపై నిజానిజాలు తెలియాలి అంటే కోర్టులో తీర్పు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు