Soundarya: ఆ హీరోతో ఎఫైర్.. బీజం వేసింది అక్కడే..!

Soundarya.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు దక్కించుకున్న వారిలో సౌందర్య కూడా ఒకరు.. తన అందంతో.. నటనతో.. కట్టుబొట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌందర్య అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని ఊహించని రీతిలో ఆక్సిడెంట్ లో మరణించి అందరిని ఆశ్చర్యపరిచింది. హెలికాప్టర్ ప్రమాదంలో స్వర్గస్తురాలు అయ్యింది సౌందర్య.. మరణించి ఇన్నేళ్లు అయినా..నేడు ఆమె మన మధ్య లేకపోయినా.. ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు అభిమానులను కంట తడి పెట్టిస్తూనే ఉంటాయి. ఇకపోతే సౌందర్య అంటే చాలామందికి వీరాభిమానం.. ఎప్పటికీ వాళ్ళు సినిమాలలో కనీసం ఫోటో రూపంలో అయినా సరే ఆమెను మనం చూడవచ్చు.. అంతలా గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య..

సౌందర్యపై ఎఫైర్ రూమర్స్..

Soundarya: The affair with that hero.. that's where the seed was planted..!
Soundarya: The affair with that hero.. that’s where the seed was planted..!

ఇంతటి గొప్ప వ్యక్తిపై కూడా అప్పట్లో చాలా రూమర్స్ వినిపించాయి.. ముఖ్యంగా హీరో వెంకటేష్ తో ఈమె ఎఫైర్ నడిపిందనే వార్తలు కూడా రావడం గమనార్హం.. అయితే ఈ వార్తలు రావడానికి అసలు కారణం ఏమిటి..? ఎక్కడ బీజం పడింది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ లో స్టార్ పొజిషన్..

అసలు విషయంలోకి వెళ్తే.. సౌందర్య కన్నడ అమ్మాయి అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది.. తెలుగమ్మాయిగా.. కట్టు బొట్టు.. తెలుగుదనాన్ని ఉట్టిపడేలా చేశాయి.. ఎక్కువగా ఇద్దరు, ముగ్గురు హీరోలతోనే చేసింది. అందులో వెంకటేష్, జగపతిబాబుతోనే ఏకంగా ఐదారు సినిమాలు చేసింది సౌందర్య .. ఇక వీరితో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, జె.డి చక్రవర్తి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి వారితో కూడా కలిసి నటించింది.

- Advertisement -

సోదరుడి వివాహానికి వెంకటేష్ కు మాత్రమే ఆహ్వానం.

ఇదిలా ఉండగా తన పెళ్లి కంటే ముందే తన సోదరుడి వివాహం జరిగిన విషయం తెలిసిందే. సౌందర్యకి తోడబుట్టిన సోదరుడు ఉన్నాడు. 1997లో అతడి పెళ్లి జరగగా సౌందర్యనే స్వయంగా దగ్గరుండి మరీ తన సోదరుడి వివాహాన్ని జరిపించింది.. అన్నీ తానై వ్యవహరించింది.. అప్పటికే సౌందర్య ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. దీంతో చాలా గ్రాండ్ గానే సోదరుడి వివాహం జరిపించారు సౌందర్య. అయితే ఈ వివాహానికి బంధుమిత్రులను ఆహ్వానించిన ఈమె సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరిని ఆహ్వానించలేదు.. కేవలం విక్టరీ వెంకటేష్ మాత్రమే ఆమె తన సోదరుడి వివాహ వేడుకకు ఆహ్వానించింది.

అక్కడే రూమర్స్ కి బీజం..

నిజానికి సౌందర్య, వెంకటేష్ కాంబినేషన్లో దాదాపు 8 సినిమాలు వచ్చాయి. వాటిలో రాజా, పవిత్ర బంధం, దేవీపుత్రుడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా, పెళ్లి చేసుకుందాం రా వంటి సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒకటి రెండు మినహా అన్ని సినిమాలు కూడా భారీ విజయాన్ని సాధించాయి.. వీరిద్దరూ కలిసి వరుస సినిమాలు చేయడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. నిజానికి అప్పటికే వెంకటేష్ కి పెళ్లయింది.. అయినా సరే ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ సృష్టించారు.. పైగా తన సోదరుడు పెళ్లికి కూడా కేవలం వెంకటేష్ ని ఆహ్వానించడంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది..

అసలు కారణం ఇది..

నిజానికి తన సోదరుడి వివాహానికి వెంకీని మాత్రమే పిలవడానికి మరో బలమైన కారణం కూడా ఉందట ..ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో “పెళ్లి చేసుకుందాం” సినిమా షూటింగ్.. బెంగళూరులోనే జరగడంతో ఆయనను మాత్రమే ఆమె పెళ్లికి ఆహ్వానించిందట. ఆ పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది కానీ బయట మాత్రం రకరకాలుగా రూమర్స్ సృష్టించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు