Kajal Agarwal: భర్తతో కాజల్ చూసిన తొలి సినిమా అదే..!

Kajal Agarwal.. ప్రముఖ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు వరుస సినిమాలు చేసి భారీ క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ మొదలుకొని చిరంజీవి వరకు అటు తండ్రులతో ఇటు కొడుకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ గా కూడా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను కరోనా సమయంలో వివాహం చేసుకొని.. వివాహం అనంతరం ఒక కొడుకుకు జన్మనిచ్చింది.. కరోనా సమయంలో దాదాపుగా ఇంటికే పరిమితమైన ఈమె.. ఇటీవలే మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చి.. బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమాలో నటించి భారీ హిట్ సొంతం చేసుకుంది..ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేస్తోంది.

సత్యభామ మూవీ ప్రమోషన్స్ లో కాజల్..

అందులో భాగంగానే .. కాజల్ అగర్వాల్ కమలహాసన్ తో ఇండియన్ 2 సినిమాతో పాటూ లేడీ ఓరియంటెడ్ చిత్రం సత్యభామ లో కూడా నటించింది..ఈ సత్యభామ సినిమా మే 31వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే పలు విషయాలను పంచుకోగా వివాహం తర్వాత తన భర్త గౌతమ్ కిచ్లు తో ఆమె చూసిన మొదటి చిత్రం గురించి కూడా వెల్లడించింది.. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

గౌతమ్ కిచ్లుతో మొదటి సినిమా అదే చూశా..

Kajal Agarwal: That was the first movie Kajal saw with her husband..!
Kajal Agarwal: That was the first movie Kajal saw with her husband..!

ప్రమోషన్స్ లో భాగంగానే మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ పెళ్లి తర్వాత తన కెరియర్ ఎలా మారింది అన్న విషయాలను కూడా వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. అంతా సాఫీగానే సాగుతోంది. కానీ నా కొడుకుకి టైం మాత్రం కేటాయించలేకపోతున్నాను. దానికి కొద్దిగా బాధగా ఉంది అంటూ తెలిపింది.. ఇకపోతే పెళ్లి తర్వాత మీ భర్తకి చూపించిన మొదటి సినిమా ఏమిటి అని యాంకర్ ప్రశ్నించగా ఏ మాత్రం ఆలోచించకుండా మగధీర అని తెలిపింది కాజల్ అగర్వాల్ . మగధీర సినిమా ఇద్దరం కలిసి చూసాము.. కానీ గౌతమ్ కి ఏమీ అర్థం కాలేదు.. విజువల్స్ మాత్రం మెస్మరైజింగ్ గా ఉన్నాయని చెప్పినట్లు కాజల్ తెలిపింది. మొత్తానికి అయితే కాజల్ అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి..

- Advertisement -

మగధీర సినిమా..

నిజానికి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం మగధీర.. ఈ సినిమా ద్వారానే అటు రామ్ చరణ్ ఇటు కాజల్ అగర్వాల్ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో రాజకుమారి పాత్రలో చాలా అద్భుతంగా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ..ఈ సినిమా తర్వాతనే పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకొని లెజెండ్రీ నటులతో కూడా నటించి మెప్పించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు