Rechukka – Sonthaooru : ఒకేరోజు విడుదలైన ఎన్టీ రామారావు రెండు క్లాసిక్ చిత్రాల స్పెషల్..

Rechukka – Sonthaooru : తెలుగు చిత్ర పరిశ్రమని నాలుగు దశాబ్దాల పాటు ఏలిన హీరో నటసార్వభౌమ ఎన్టీ రామారావు. తొలితరం అగ్ర హీరో గా ఆయన సినిమాలు ఎందరో దర్శక నిర్మాతలకు హీరోలకు, టెక్నిషియన్లకు ఆదర్శంగా నిలిచేవి. ఇక ఆ రోజుల్లో పౌరాణిక జానపదాలకు పెద్ద పీట వేసే ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించేవారు. ఇప్పుడంటే స్టార్ హీరోలు ఏడాది కి రెండు సినిమాలు చేయడానికి కష్టపడుతుంటే, ఆ రోజుల్లో ఏడాదికి పది సినిమాలు చేసేవారు ఎన్టీఆర్, ఏఎన్నార్. ఒకేరోజు రెండు మూడు షిఫ్ట్ లలో పనిచేసేవారంటే ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇక ఎన్టీఆర్ నటించిన ఎన్నో క్లాసిక్ చిత్రాల గురించి ఈ తరం ప్రేక్షకుల గురించి ఇంకా తెలియదు. ఇక ఇదే (మే23) రోజున ఎన్టీఆర్ నటించిన రెండు క్లాసిక్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఒకేరోజు రెండు వేర్వేరు కాలాల్లో ఎన్టీఆర్ నుండి వచ్చిన రెండు స్పెషల్ మూవీస్ (Rechukka – Sonthaooru) గురించి ఇప్పుడు చర్చించుకుందాం. వాటిలో ఒకటి “రేచుక్క”. ఎన్టీ రామారావు అలనాటి నటి అంజలి దేవి జంటగా నటించిన జానపద చిత్రం. మరొకటి ఎన్టీ రామారావు షావుకారు జానకి నటించిన “సొంత ఊరు”.

Rechukka - Sonthaooru NT Ramrao movies special

70 వసంతాల “రేచుక్క” :

1954 లో పి. పుల్లయ్య దర్శకత్వం వహించిన జానపద చిత్రం రేచుక్క. అశ్వత్థామ సంగీతం అందించిన ఈ చిత్రంలో N. T. రామారావు, అంజలి దేవి నటించారు. ఈ కథ హాలీవుడ్ మూవీ “ది ప్రిన్స్ హూ వాజ్ ఎ థీఫ్” (1951) నుండి ప్రేరణ పొందింది. ఇక రేచుక్క చిత్రంలో ఎన్టీఆర్, అంజలి దేవి పోటాపోటీగా నటించగా, ఆ రోజుల్లో ఘన విజయం సాధించింది ఈ సినిమా. అప్పట్లో మూడు కేంద్రాల్లో 100 రోజులాడింది రేచుక్క. అయితే రేచుక్క లో ఒక చిన్న అమాయక పాత్రలో ఏఎన్నార్ గెస్ట్ అప్పీరెన్స్ లా తళుక్కున మెరిశారు. అంజలీదేవి ఏఎన్నార్ చేతిలో వస్తువు కాజేస్తుంటే, ఎన్టీఆర్ వచ్చి అడ్డుకుంటాడు. బహుశా ఒక స్టార్, ఇంకో స్టార్ హీరో సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం ఈ సినిమా నుండే మొదలైందని చెప్పొచ్చు.

- Advertisement -

కథ విషయానికి వస్తే.. మహారాజు దేవరాయలు తన కొడుకు యువరాజు అయిన కుమారరాయలు కి, మహామంత్రి తన కుమార్తె లలితా దేవిని యువరాజుతో జంటగా పెట్టాలని అనుకుంటాడు. దానికి రాజు దిక్కరించగా, మనస్తాపం చెందిన మహామంత్రి కుట్ర పన్ని రాజుని పట్టుకుంటాడు. ఈ క్రమంలో రాజు యొక్క సహాయకుడు వీరన్న యువరాజుతో కలిసి పరారీ అవుతాడు. ఆ తర్వాత గిరిజన నాయకుడు జోగులు యువరాజుని రక్షిస్తాడు. ఇదిలా ఉండగా, వీరన్న అతని భార్య, కుమార్తె నానాకు జరిగిన కథ వివరించి, రాజును వెలికి తీయడానికి కదలగా పట్టుబడ్డాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ, కుమారరాయలు గిరిజన కుగ్రామంలో కన్నగా పెరిగాడు. ఇక జైలులో వీరన్న మరణించగా, రాజు తప్పించుకుని మంత్రి కూతురు నానా ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహామంత్రి రాజు సజీవంగా ఉన్నారని తెలుసుకుంటారు. నానా ద్వారా కన్నా తన తండ్రి మహారాజు అని తెలుసుకుని, జరిగిన అనర్ధాలకు కారణమైన మహామంత్రిను చంపేస్తాడు. చివరగా, కన్న & నానాల వివాహంతో కథ ముగుస్తుంది.

68 వసంతాల సొంత ఊరు :

ఎన్టీ రామారావు షావుకారు జానకి నటించిన కుటుంబ కథా చిత్రం సొంత ఊరు. ఈ.ఎస్.ఎన్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1956 మే 23న రీలాస్ అయింది. ఘంటసాల సంగీతం అందించారు.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. ఒక గ్రామంలో రాయణం అనే రైతు దాతృత్వ కార్యక్రమాలలో తన సంపదను పోగొట్టుకోగా అతనికి మాధవ్ & చిన్నబాయి, కుమార్తె అరుణ అంటూ ముగ్గురు పిల్లలు. మాధవ్ తన చదువు పూర్తి చేసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. దానికి తన అంధ స్నేహితుడు దాసు యొక్క భూమిని కౌలుకు తీసుకుంటాడు. ఈ క్రమంలో ఊళ్ళో లక్ష్మి మాధవ్ ని ప్రేమిస్తుంది. అప్పుడప్పుడూ వారికి తెలియకుండా వారి అవసరాలకు కూడా సహాయం చేస్తుంది. అది తెలుసుకున్న గ్రామానికి చెందిన మునసబు దయానిధి మాధవ్ కోపంగా ఉన్నప్పుడు మరియు లక్ష్మిని ప్రశ్నిస్తే, దాసు ద్వారా లక్ష్మి ప్రేమను గుర్తిస్తాడు. చివరికి మునసబు తో పాటు పాత కక్ష్యలు ఉన్న కొందరు కలిసి దయానిధి, లక్ష్మిని కొట్టగా, అరుణ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. వీరంతా ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకున్నారు, తిరిగి ఎలా ఒకటి అయ్యారు అనేది మిగతా కథ. 1956 మే 23న విడుదలైన ఈ చిత్రం మొదట్లో అంతగా ఆడకపోయినా, రిపీట్ రిలీజ్ లలో మంచి విజయం సాధించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు