OTT Movie : అత్యంత దారుణంగా వరుస హత్యలు… అమ్మాయిలే ఈ సీరియల్ కిల్లర్ టార్గెట్

OTT Movie : ఓటిటీలో వచ్చే కొన్ని సినిమాలు కంటెంట్ ఎలా ఉన్నా సంబంధం లేకుండా భారీ బజ్ తో రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ మరికొన్ని సినిమాల విషయంలో మాత్రం ఇది విభిన్నంగా ఉంటుంది. కంటెంట్ బాగున్నప్పటికీ కనీసం ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్న విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. కనీసం ఓటీటీ సంస్థలు కూడా ఆ సినిమాలను పెద్దగా ప్రమోట్ చేసుకోవు. నిజానికి ఓటీటీలోకి వచ్చే ప్రతి సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది అన్న గ్యారంటీ లేదు. థియేటర్లలో లాగే ఓటిటీలో కూడా కొన్ని సినిమాలు మాత్రమే అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ప్రస్తుతం ఓటీటీలో ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ మూవీ గురించి. అత్యంత దారుణంగా వరుస హత్యలు చేసే సీరియల్ కిల్లర్ అమ్మాయిలని టార్గెట్ గా చంపుతూ ఉంటాడు. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రింగ్ అవుతుంది? ఆ మూవీ పేరేంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం తెలంగాణలో థియేటర్లు బంద్ కావడంతో ఓటీటీలో ఉండే మంచి కంటెంట్ గురించి వెతకడం మొదలు పెట్టారు టాలీవుడ్ మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఏడు నెలల తర్వాత ఓటిటిలోకి వచ్చేసింది. బిగ్ స్క్రీన్ లో ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది. ఇప్పటిదాకా సైకో కిల్లర్ జానర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

Garuda Purana streaming: where to watch online?

- Advertisement -

ఊహకు అందని ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పేరు గరుడ పురాణం. ఈ కన్నడ సినిమాకు మంజునాథ్ దర్శకత్వం వహించారు. ఓటిటి లోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ మూవీ గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడాలంటే రెంట్ కట్టాల్సిందే. ఎందుకంటే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది.

మూవీ స్టోరీ ఏంటంటే…

కర్ణాటక బోర్డర్ లో కొంతమంది అమ్మాయిలు వరుసగా హత్యకు గురవుతూ ఉంటారు. ఆ సైకో కిల్లర్ కేవలం అమ్మాయిలని టార్గెట్ గా చేసుకుని చంపుతూ వస్తాడు. కానీ పోలీసులకు మాత్రం ఆ అమ్మాయిల హత్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకవు. దీంతో ఈ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ టీంకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఇక ఈ కేసులో ఒక ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుంటారు పోలీసులు. మరి అమ్మాయిలు ఎలా చనిపోతున్నారు? ఆ హత్యలతో ఈ ముగ్గురు మిత్రులకు సంబంధం ఉందా? పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు ? అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు ? వంటి విషయాలు తెలియాలంటే గరుడ పురాణం మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు