Selfish: సెల్ఫిష్ అనుకున్నట్టు రాలేదు.. కానీ ఆగిపోలేదు

Selfish: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు సుకుమార్. మొదటి సినిమాలోని తనదైన మార్కుని క్రియేట్ చేసాడు. ఒక విభిన్న దర్శకుడుగా తనకంటూ సొంత గుర్తింపు సాధించుకొని మంచి పేరును సంపాదించారు. ఇప్పుడు సుకుమార్ అంటే తెలియని వారు లేరు ఎందుకంటే పుష్ప సినిమాతో ఆ రేంజ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడు కాబట్టి.

అసిస్టెంట్ డైరెక్టర్స్ టూ డైరెక్టర్స్

ఇకపోతే సుకుమార్ తన దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఇచ్చే వ్యాల్యూ వేరు. వాళ్ళని చూసుకునే విధానం వేరు. చాలామంది ఇప్పుడున్న దర్శకుల దగ్గర సహాయదర్శకులు చాలామంది అలానే మిగిలిపోతున్నారు. కానీ సుకుమార్ దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్లు కూడా డైరెక్టర్ గా ఎదిగి సినిమాలు చేయటం మొదలుపెట్టారు. సుకుమార్ దగ్గరే ఎన్నోఏళ్లుగా పనిచేసిన బుచ్చిబాబు సాన ఉప్పెన సినిమాతో దర్శకుడుగా మారాడు. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. సూర్య ప్రతాప్ పల్నాటి అనే దర్శకుడు కూడా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చినవాడే. కుమారి 21ఎఫ్ సినిమాతో సూర్యప్రతాప్ పల్నాటి కూడా దర్శకుడుగా తన పేరును నిలబెట్టుకున్నాడు. తన మరో శిష్యుడైన కాశీ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ను దర్శకుడుగా చేసే ప్రయత్నం చేశాడు సుకుమార్.

Selfish

- Advertisement -

సెల్ఫిష్ ఆగిపోయిందా.?

కాశీ దర్శకుడిగా ఆశిష్ తో సెల్ఫిష్ అనే సినిమాను మొదలుపెట్టారు.
ఈ సినిమా దాదాపు 50% పూర్తి కూడా అయిపోయింది.ఈ సినిమా హోల్డ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు ఈ చిత్రానికి 12.5 కోట్లకు పైగా ఖర్చు చేసారు. కానీ సినిమా రఫ్ కట్ చూసి దిల్ రాజు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపించాయి.ఇప్పుడు సినిమా అంత మళ్ళీ కొత్తగా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది.

సెల్ఫిష్ రీ రైటింగ్

సెల్ఫీష్ సినిమాకి సంబంధించి అప్డేట్ రాకపోయేసరికి అందరూ ఆగిపోయింది అనుకున్నారు. ఆశిష్ 2వ సినిమాను వదిలి 3వ సినిమా అయినా లవ్ మీ రిలీజ్ సిద్ధంగా ఉండడంతో సెకండ్ సినిమా సెల్ఫీస్ ఆగిపోయింది అనుకునే తరుణంలో దాని గురించి క్లారిటీ ఇచ్చాడు ఆశిష్. అయితే ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్లు రాలేదని లవ్ మీ సినిమా తర్వాత మళ్లీ ఆ సినిమాకే పని చేస్తానని, ఇప్పుడు ప్రస్తుతం ఆ సినిమాని రీరైట్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. సుకుమార్ శిష్యుడు దర్శకుడుగా మారుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు