Nidhhi Agerwal: రిపోర్టర్ కు మాస్ కౌంటర్ ఇచ్చిన నిధి అగర్వాల్

Nidhhi Agerwal

ఇటీవల కాలంలో తెలుగు ప్రెస్ మీట్ ఎక్కువ పెరిగిపోయిన విషయం తెలిసిందే. గతంలో సినిమా ప్రమోషన్స్ చేయాలంటే ఆడియో లాంచ్ ఈవెంట్ లు ఇంటర్వ్యూలే దిక్కు అయ్యేవి.. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా ఈ మధ్య ప్రెస్ మీట్ లకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. అలాగే ఈ ప్రెస్ మీట్ లలో రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలు మరియు సెలెబ్రెటీలు ఇచ్చే సమాదానాలు చాలా పాపులర్ అవడం చూస్తూనే ఉన్నాం.

ఇక లేటెస్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సాలిడ్ కౌంటర్ వేయగా ప్రస్తుతం నిధి అగర్వాల్ ఇచ్చిన రిప్లై వీడియో బైట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. యంగ్ హీరోలకు సీనియర్ హీరోలకు అంటూ తేడా లేకుండా ఎవరి పక్కన నటించిన కూడా ఇట్టే జోడిగా సెట్ అయ్యే నిధి అగర్వాల్ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గిపోయింది.

అశోక్ గల్లా నటించిన హీరో సినిమా తరువాత టాలీవుడ్ లో గ్యాప్ తీసుకున్న ఈ భామ ఇప్పుడిప్పుడే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. ఇక ప్రెస్ మీట్ లో ఈ నిధి అగర్వాల్ ను ఒక విలేకరి మీరు సినిమా.. సినిమాకు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు.. మీకు అవకాశాలు రావడం లేదా.. లేక మీరే కావాలనే గ్యాప్ తీసుకుంటున్నారా అని అడగగా.. ఆమె వెంటనే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలోని గ్యాప్ ఇవ్వాలే.. వచ్చింది.. అనే డైలాగ్ చెప్పి రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చింది.

- Advertisement -

నిధి అగర్వాల్ ఇచ్చిన రిప్లై కు అక్కడున్న అందరు ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు. అలాగే ఆమె విలేకరి ప్రశ్నకు వివరణ ఇస్తూ.. ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలలో నటిస్తున్న త్వరలోనే డీటేల్స్ బయటకు వస్తాయని చెప్పింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు