Allu Arjun: ట్రోల్స్ వల్ల అటువంటి పని చేయలేకపోతున్న బన్నీ.. పాపం అంటున్న ఫ్యాన్స్..!

Allu Arjun: అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ కెరీర్ మొదటినుంచి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే పుష్ప సినిమా మాత్రం మరొక ఎత్తు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‌ ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ నే పూర్తిగా మార్చేసింది.

స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా హీరో చేసింది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడి రష్మిక నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే మొదట్లో అల్లు అర్జున్ ని సర్జరీ స్టార్ అని.. తన నవ్వును హేళన చేస్తూ అనేక ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.

bunny-cant-do-such-a-thing-because-of-trolls
bunny-cant-do-such-a-thing-because-of-trolls

వాటన్నిటిని దాటుకుని ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ పొజిషన్ కి ఎదిగాడు. కానీ తనపై బాగా వైరల్ అయిన వాటిలో తన నవ్వు ట్రోల్స్ ఎక్కువగా ఉంటాయి. ట్రోల్స్ వల్ల సరిగా నవ్వు కూడా నవ్వలేకపోతున్నాడు అల్లు అర్జున్. ఏ ఈవెంట్స్ లో పాల్గొన్న తనకి నవ్వు వస్తే చెయ్యి అడ్డుపెట్టుకుని మరి నవ్వుతున్నాడు బన్నీ. ఇక ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు