Radhika Sarath Kumar: పవన్ కోసం బరిలోకి దిగిన రాధిక.. పోస్ట్ వైరల్..!

Radhika Sarath Kumar.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా సినీ సెలబ్రిటీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు.. మరికొంతమంది నేరుగా పిఠాపురం వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు మగవారే కాదు ఆడవారు కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తున్నారు.. లేడీ సెలబ్రిటీస్ ఆయన కోసం మద్దతు పలుకుతూ గాజు గ్లాసుకి ఓటు వేయాలి అంటూ అభ్యర్థిస్తున్నారు.. ఇక నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ తరఫున సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ కు అండగా ప్రజలు నిలవాలని.. గాజు గ్లాస్ కి ఓటు వేయాలి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలను కోరింది..

Radhika Sarath Kumar: Radhika entered the ring for Pawan.. Post viral..!
Radhika Sarath Kumar: Radhika entered the ring for Pawan.. Post viral..!

పవన్ కళ్యాణ్ కు అండగా రాధిక శరత్ కుమార్..

ఇక అలాగే ప్రముఖ యంగ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీలా కూడా పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలి అని.. ఆయనకు అండగా నిలవాలని ట్విట్టర్ రూపంలో తన మద్దతు తెలియజేసింది.. ఇక ఇప్పుడు లెజెండ్రీ యాక్ట్రెస్ రాధిక శరత్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ వేయడం గమనార్హం. తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. మీరు చేసే సేవ ప్రజలకు మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నారు. మీరు తప్పకుండా ఎన్నికల్లో గెలుస్తారు అంటూ రాధిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించింది..

అందుకే పవన్ కు మద్దతు..

ఇకపోతే రాధిక విషయానికి వస్తే.. గతంలో ఈమె చిరంజీవితో పలు చిత్రాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో చిరంజీవి, రాధిక మధ్య ఎఫైర్ రూమర్స్ కూడా వినిపించాయి. ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ పలు పత్రికలు కూడా బహిరంగంగానే ఈ విషయంపై మాట్లాడాలి కానీ ఇందులో నిజం లేకపోయింది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో నటించడం వల్ల ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారు.. కానీ వీరిద్దరూ మంచి స్నేహితుల అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పటికి కూడా పలు ఈవెంట్స్ లో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు. అందుకే చిరంజీవి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ కి ఓటు వేయండి అంటూ రాధికా శరత్ కుమార్ ప్రజలకు పిలుపునిస్తోంది. ఇక టాప్ సెలబ్రిటీల నుండి పవన్ కళ్యాణ్ కు మద్దతు లభిస్తూ ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పిఠాపురంలో పవన్ గెలుస్తారా..

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో తాను అధికారంలోకి రావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. అందుకే సెలబ్రిటీల మద్దతు పొందుతున్నారు.. మరి సెలబ్రిటీల మద్దతు అయితే పవన్ కళ్యాణ్ కి లభించింది.. కానీ ప్రజలు ఏ మేరకు ఈయనకు పట్టం కడతారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు